/rtv/media/media_files/2025/04/25/wE40HhZpXMPDesaVt1if.jpg)
Tamil Nadu Train Accident
Tamil Nadu Train Accident: తమిళనాడులోని అరకోణం ప్రాంతంలో శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. గుర్తుతెలియని వ్యక్తులు రైల్వే ట్రాక్‌పై ఉన్న బోల్ట్‌లను తొలగించడం గమనించిన అధికారులు సకాలంలో స్పందించి ప్రమాదాన్ని నివారించారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది, సంబంధిత రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
రైళ్ల మార్గం మళ్లింపు..
ఈ ఘటన కారణంగా బెంగళూరు, కేరళ వైపు వెళ్తున్న పలు రైళ్లను వేరే మార్గాల ద్వారా పంపించారు. దీంతో ప్రయాణికులకు స్వల్ప అసౌకర్యం ఎదురైంది. కొన్ని రైళ్లు ఆలస్యంగా నడవగా, మరికొన్నింటిని రద్దు చేయాల్సి వచ్చింది.
రైల్వే పోలీసులు కేసు నమోదు
ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే భద్రతా విభాగం (ఆర్‌పీఎఫ్) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. బోల్ట్‌లను తొలగించడం పూర్తిగా కుట్రగా పరిగణించిన అధికారులు, దీనికి పాల్పడిన దుండగులను పట్టుకునేందుకు విచారణ చేపట్టారు.
Also Read: ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఉండవు : బీసీసీఐ