suryapet murder: నా కూతురిని ఇంటికి తెచ్చుకుంటాం.. భార్గవి తల్లి కన్నీటి కథ!

సూర్యాపేట పరువు హత్య కేసులో భార్గవి తల్లి తన బిడ్డ గురించి చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇదంతా జరిగినా సరే తమ కూతురిని తమతోపాటు తీసుకొస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. 

New Update

Suryapet Murder: పరువు, కులం, మతం చాటున సాటి మనుషుల పట్ల విద్వేషాన్ని వెళ్లగక్కడం ఇటివలీ ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. కులం పేరిట హత్యలు జరగడం ఇప్పటి విషయం కాకున్నా శాస్త్రసంకేతిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న 21వ శతాబ్దాంలోనూ పరువు హత్యలు జరుగుతుండడం అత్యంత దుర్మార్గమైన విషయం. ముఖ్యంగా కులం కోసం కొట్టుకుచచ్చే వారు తెలుగురాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తారు. అలాంటి కుల హత్యే సూర్యాపేటలో జరగడం సమాజాన్ని తలదించుకునేలా చేసింది.

Also Read: ఏ-1 అన్న, ఏ4- నానమ్మ.. ఆయుధమే లేకుండా హత్య.. సూర్యాపేట ఎస్పీ షాకింగ్ ప్రకటన!

ఆవేదన తల్లి 

సూర్యాపేటలో  కృష్ణ అలియాస్‌ మాలబంటిని కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపంతో అమ్మాయి అన్నయ్య దారుణంగా హత్య చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. భర్త, పిల్లలతో నూరేళ్ళ సంతోషంగా ఉండాల్సిన కూతురు పాతికేళ్లకే  భర్తను పోగొట్టుకొని దిక్కుతోచని స్థితిలో మిగిలిపోవడం. మరో వైపు కూతురి భర్తను చంపి కొడుకు జైలు పాలవడంతో ఆ కన్నతల్లి  తల్లడిల్లిపోతుంది. ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడిన భార్గవి తల్లి  తన బిడ్డ గురించి చెబుతూ  కన్నీటి పర్యంతమయ్యారు. 

ఇది కూడా చదవండి:Johny master : జానీ మాస్టర్ పై కేసు.. తొలిసారి నోరు విప్పిన కొరియోగ్రాఫర్.. సంచలన ఇంటర్వ్యూ!

నా కూతురిని మాతో పాటు తెచ్చుకుంటాము.. 

"కృష్ణను తన కుమార్తె ప్రేమించిన విషయం తమకు తెలియదని. కూతురి కోసం పోలీస్ కానిస్టేబుల్ సంబంధం తీసుకొచ్చి.. కట్నం కూడా మాట్లాడమని భార్గవి తల్లి తెలిపింది. కానీ, పెళ్లి కుదిరిన తర్వాత భార్గవి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్లారు.  తామెంత బ్రతిమాలిన భార్గవి తమ మాట వినిపించుకోలేదని తెలిపారు. దీంతో ఎలా జరిగితే అలా జరుగుతుందని భార్గవి ఇష్టప్రకారమే వదిలేసి వచ్చినట్లు చెప్పారు. ఇదంతా జరిగినా సరే తమ కూతురిని తమతోపాటు తీసుకొస్తామని భార్గవి తల్లి చెబుతున్నారు."

Also Read:Double ISMART: తెలుగులో ఫ్లాప్.. హిందీలో 100 మిలియన్ల వ్యూస్.. యూట్యూబ్ లో డబుల్ ఇస్మార్ట్ సర్ప్రైజ్!

Advertisment
Advertisment
తాజా కథనాలు