Telangana: అత్తపై అల్లుడి మోజు.. అర్ధరాత్రి మీదమీదకెళ్లి లైంగికదాడి - చివరికి..!

నిర్మల్ జిల్లా ముథోల్‌ మండలం తరోడ గ్రామంలో దారుణం జరిగింది. 68ఏళ్ల అత్తపై అల్లుడు షేక్ నజీం లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై హాస్పిటల్‌కు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చిన ఆమెపై మరుసటి రోజు అదే తీరు ప్రవర్తించాడు. సహనం కోల్పోయిన అత్త అతడిని హతమార్చింది.

New Update
NIRMAL

NIRMAL

రోజు రోజుకూ మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. వావి వరుస లేకుండా కొందరు మృగాళ్ల ప్రవర్తిస్తున్నారు. చిన్నా పెద్దా, ముసలి ముతక అనే తేడా లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. సొంత వారిపైనే లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. పక్కనే ఉంటూ.. మంచి వారిలా నటించి ఆఖరికి ఎవరూ లేని సమయం చూసి బలవంతంగా అత్యాచారం చేస్తున్నారు.

చివరికి ముసలివాళ్లను కూడా వదిలిపెట్టడం లేదు. ఆఖరి వయసులో ఎంతో ప్రేమగా, ఆనందంగా చూసుకోవలసిన సొంతవారే కామంతో కళ్లు మూసుకుపోయి అఘాయిత్యాలకు పాల్పడుతుండటం తలదించుకోవలసిన విషయం అనే చెప్పాలి. తాజాగా ఇలాంటిదే ఓ షాకింగ్ ఇన్సిడెంట్ తెలంగాణలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన 68 ఏళ్ల వృద్ధురాలైన అత్తపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించే క్రమంలో తీవ్రంగా గాయాలయ్యాయి.

అనంతరం ఆమెను కొందరు హాస్పిటల్‌లో చేర్చారు. ఆ తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి రాగా.. మళ్లీ ఆమెపై అదే రకమైన తీరు ప్రదర్శించాడు. దీంతో శాంతం, సహనం కోల్పోయిన ఆ అత్త తన అల్లుడిని హతమార్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

అత్తపై అల్లుడి లైంగిక దాడి

45 ఏళ్ల షేక్ నజీం అనే వ్యక్తి 10 ఏళ్ల క్రితం మహారాష్ట్రలోని హిమాయత్‌నగర్‌ నుండి నిర్మల్‌ జిల్లా ముథోల్‌ మండలం తరోడ గ్రామానికి వలస వచ్చాడు. తనతో పాటే తన భార్య, కుమారుడు, అత్తమ్మను కూడా తీసుకువచ్చాడు. అలా అప్పటి నుండి చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా షేక్ నజీం మద్యానికి విపరీతంగా బానిసయ్యాడు. 

దీంతో తరచూ ఫుల్‌గా తాగొచ్చి ఫ్యామిలీని వేధించడం మొదలెట్టాడు. ఇలా ప్రతి రోజు తాగొచ్చి గొడవ చేసేవాడు. అయితే పదిరోజుల క్రితం అతడి భార్య పని నిమిత్తం తన కొడుకుని తీసుకుని మహారాష్ట్రలోని శివుని గ్రామానికి వెళ్లింది. దీంతో అత్త, అల్లుడే ఇంటి వద్ద ఉన్నారు. ఈ క్రమంలో అప్పటికే మద్యం మత్తులో మునిగితేలుతున్న షేక్ నజీం.. రెండ్రోజుల క్రితం మరోసారి ఫుల్‌గా ఇంటికి తాగొచ్చాడు. 

దీంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న అత్తపై ఒక్కసారిగా లైంగిక దాడి చేశాడు. ఆ సమయంలో అత్త భయపడి అమాంతంగా అతడిని పక్కకి తోసేసింది. అయినా అతడు వదల్లేదు. లైంగిక దాడి అనంతరం ఆమె హాస్పిటల్‌కు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుని ఇంటికి తిరిగి వచ్చింది. ఈ క్రమంలోనే సోమవారం అర్థరాత్రి అల్లుడు షేక్ నజీం మరోసారి తన అత్తపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. 

దీంతో శాంతి, సహనం కోల్పోయిన ఆ అత్త తన పక్కనే ఉన్న కర్రతో అతడి తలపై గట్టిగా కొట్టింది. అనంతరం గొంతు పిసికి హత్య చేసింది. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందుతురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై రిమాండుకు తరలించినట్లు ముథోల్‌ సీఐ మల్లేశ్, ఎస్సై బిట్ల పెర్సిస్‌లు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు