రోజురోజుకీ ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులు పెరుగుతున్నాయి. ఎంతో మంది యువకులు ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిస అయ్యి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇలానే ఓ సాఫ్ట్‌వేర్ యువకుడు బెట్టింగ్ యాప్‌ల వల్ల ఆత్మహత్య చేసుకున్న ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తంబళ్లపల్లె మండలంలోని దిగువగాలిగుట్టకు చెందిన పద్మనాభరెడ్డి బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.
ఇది కూడా చూడండి: దేవర ఫేక్ కలెక్షన్లపై నిర్మాత క్లారిటీ.. ఫ్యాన్స్ ఆనందం కోసమే అలా..!
రైలు కింద పడి ఆత్మహత్య..
ఉద్యోగం చేస్తూ.. ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు వేసి రూ.24 లక్షలు పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న బాధలో.. అమ్మమ్మ ఇంటికి వెళ్లడానికి బయలు దేరాడు. కానీ ఇంటికి వెళ్లకుండా మధ్యలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు చనిపోతున్నానో అని తెలుపుతూ.. ఓ లేఖ రాసి మధ్యలో రైలు కిందపడి చనిపోయాడు. స్థానికులు వెంటనే పోలీసులకు తెలియజేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతని ఆత్మహత్య లేఖ, గుర్తింపు కార్డు, ల్యాప్‌టాప్, ఫోన్ ఆధారంగా పద్మనాభరెడ్డిగా గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి, దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చూడండి: USA: ఇజ్రాయెల్‌కు అమెరికా కీలక ఆయుధాలు
ఇంతకీ ఆ లేఖలో ఏం రాశాడంటే.. ఆన్‌లైన్ బెట్టింగ్ ద్వారా దాదాపుగా రూ.24 లక్షలు పోగొట్టుకున్నా.. ఎవరూ కూడా దయచేసి బెట్టింగ్ జోలికి పోవద్దు. చాలా ప్రమాదకరమని తెలిపాడు. బెట్టింగ్ మాఫియా వాళ్ల ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతా వివరాలు చెప్పిన కూడా పోలీసులు ఏం చేయలేకపోయారు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా.. నా చావుకు నేనే కారణమని గుడ్‌బై అంటూ లేఖ రాశాడు. ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబమంతా విషాదంలోకి వెళ్లిపోయింది. ఈ మధ్య కాలంలో యువకులు ఎక్కువగా ఈ బెట్టింగ్‌లకు అలవాటు పడి ప్రాణాలను తీసుకుంటున్నారు.
ఇది కూడా చూడండి: Ap: బంగాళాఖాతంలో అల్పపీడనం..4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు!