USA: ఇజ్రాయెల్‌కు అమెరికా కీలక ఆయుధాలు

ఇజ్రాయెల్, ఇరాన్ ల మధ్య యుద్ధం ముదురుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌కు మద్దతిస్తున్న అమెరికా ఆ దేశానికి కీలక ఆయుధాలను పంపిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తమ సైనికులను ఇజ్రెల్‌కు దూరంగా ఉంచాలని అమెరికాను ఇరాన్ హెచ్చరిస్తోంది. 

New Update
Iran Attack: ఆ దేశాలకు వెళ్ళకండి.. కేంద్రం హెచ్చరిక

America Air Defence: 

పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న వేళ ఇజ్రాయెల్‌కు అత్యాధునిక వైమానిక రక్షణ వ్యవస్థ మోహరించనున్నట్లు అమెరికా ప్రకటించింది. టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ బ్యాటరీ ని, సైనిక దళాలను ఇజ్రాయెల్‌కు పంపుతున్నట్లు పెంటగాన్  ప్రకటించింది. అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు ఈ వ్యవస్థను మోహరించేందుకు రక్షణశాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ అనుమతి ఇచ్చారని చెప్పింది. ఈ యుధాలతో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని అమెరికా చెబుతోంది. టీహెచ్‌ఏఏడీ అనేది ఒక ఎయిర్  రక్షణ వ్యవస్థ. శత్రువులు ప్రయోగించే బాలిస్టిక్‌ క్షిపణులను ఇది కూల్చేస్తుంది.

ఇజ్రాయెల్కు అమెరికా ఆయుధాలను అందిస్తోందని... ఇరాన్ ఎప్పటి నుంచో ఆరోఇస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు అమెరికానే స్వయంగా ఇప్పుడు క్షిపణి నిరోధక వ్యవస్థను మోహరించి, దాన్ని నిర్వహించేందుకు బలగాలను పంపిస్తున్నామని అమెరికా ప్రకటించింది. ఇది ఇజ్రాయెల్ ప్రజలను కూడా ప్రమాదంలో పడేస్తుందని ఇరాన్ అంటోంది. ఇజ్రాయెల్‌తో యుద్ధం ఆగేందుకు తాము అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని..కానీ తమ ప్రజలను కాపాడుకునేందుకు ఎలాంటి హద్దులను అయినా చెరిపేయడానికి వెనకాడమని ఇరాన్ విదేశాంగ మంత్రి సయీద్ అబ్బాస్ అరాఘ్చీ హెచ్చరించారు.

Also Read: Cricket: కీలక మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓటమి..సెమీస్‌ డౌటే

Advertisment
Advertisment
తాజా కథనాలు