/rtv/media/media_files/2025/04/26/fx9xASgiidqwEmbjiLiW.jpg)
Sircilla Rape Case
Sircilla Rape Case: తెలంగాణ, సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పక్కింటి వివాహితపై అత్యాచారయత్నానికి పాల్పడి, ఆమెను హత్య చేసిన వ్యక్తి అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.
Also Read: BIG BREAKING: ఉగ్రదాడిపై అంతర్జాతీయ విచారణ.. పాక్ సంచలన డిమాండ్!
వివరాల్లోకెళ్తే స్థానికంగా నివసించే ఉల్లి శ్రీకాంత్ అనే వ్యక్తి, తన పక్కింటి వివాహిత రేఖను చెల్లి అంటూ పిలుస్తూ నమ్మకంగా మాయ చేశాడు. అయితే, శ్రీకాంత్ భార్య పుట్టింటికి వెళ్లిన టైంని ఆసరాగా తీసుకుని, రేఖపై అసభ్యంగా ప్రవర్తించాడు. అతడి మాయలో పడని రేఖ ప్రతిఘటించడంతో, శ్రీకాంత్ ఆమెపై కొడవలితో దాడి చేసి హత్య చేశాడు.
Also Read: BIG BREAKING: కశ్మీర్ సమస్యపై స్పందించిన ట్రంప్
బలమైన గాయాలు, పంటి గాట్లు..
అయితే, రేఖ భర్త విదేశంలో ఉద్యోగం చేస్తుంటాడు, ఇంతటి దారుణ హత్య చేసి భయంతో శ్రీకాంత్ తన ఇంట్లోనే తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాలను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రేఖ శరీరంపై బలమైన గాయాలు, పంటి గాట్లు ఉండటంతో ఇది ప్లాన్ ప్రకారంగానే చేసిన దాడిగా అనుమానిస్తున్నారు.
Also Read: BIG BREAKING: పాక్ కి భారీ షాక్..10 మంది సైనికులు హతం!
ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. నిందితుడు చెల్లి అంటూ నమ్మించి ఇంత దారుణానికి పాల్పడిన తీరు ప్రజలను షాక్‌కు గురి చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.