/rtv/media/media_files/2025/01/20/nHBnWz2xfhlQAo1irY02.jpg)
Aishwarya, abbas Photograph: (Aishwarya, abbas)
సినీ పరిశ్రమలో ఒక నటుడి సినిమాలు బాగా ఆడితే పర్వాలేదు, కానీ సినిమాలు ఫ్లాప్ అయితే మాత్రం పరిస్థితి ఇంకోలా ఉంటుంది. అతనితో సినిమాలు చేసేందుకు డైరెక్టర్లు, నిర్మాతలు ఎవరూ కూడా ముందుకు రారు. సరిగ్గా అలాంటి ఘటనే దక్షిణాది దిగ్గజ నటుడు మీర్జా అబ్బాస్ అలీకి ఎదురైంది. కెరీర్‌లో చాలా ఇబ్బంది పడ్డ ఆయన.. ఒకానొక సమయంలో చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ అయిన అబ్బాస్.. ఒక్క తప్పుడు నిర్ణయం అతని గమ్యాన్ని మార్చేసింది. ఆ నిర్ణయం వల్ల అబ్బాస్ అతని జీవితంలో ఎన్నో కష్టాలు చూశాడు. చివరికి పెట్రోల్ పంపులో పనిచేశాడు. బాత్రూమ్‌లను క్లీన్ చేశాడు. మెకానిక్‌గా కూడా మారాడు.
1994లో మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించాడు అబ్బాస్. 1996లో 'కాదల్ దేశం' అనే తమిళ చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అతని ఇదే మొదటి సినిమా. సూపర్ డూపర్ హిట్ అయింది. తెలుగులో దీన్ని ప్రేమదేశం పేరుతో రిలీజ్ చేశారు. దీంతో అమ్మాయిల్లో అబ్బాస్ పేరు మారుమోగింది. దీని తర్వాత 'ప్రియా ఓ ప్రియా', 'రాజహంస', 'రాజా', 'సూయంవరం', 'పడేయప్ప' వంటి అనేక తెలుగు, తమిళ హిట్‌లలో నటించి అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు అబ్బాస్. దాదాపు ఆయన చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి.
అబ్బాస్ గ్రాఫ్ డౌన్
అబ్బాస్ హిందీలోనూ నటించారు. కమల్ హాసన్ నటించిన హే రామ్ సినిమాలో కూడా చిన్న పాత్ర పోషించారు. ఐశ్వర్యరాయ్ బచ్చన్ సరసన అబ్బాస్ నటించిన 'కందుకొడైన్ పండుడెన్' అతని కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవాలి. ఇందులో మమ్ముట్టి, అజిత్ కుమార్, టబు కూడా కూడా నటించారు. అయితే హిందీ సినిమాల్లో నటిస్తున్న టైమ్ లో అబ్బాస్ దక్షిణాదిలోని పలు ప్రాజెక్టులను రిజెక్ట్ చేశాడు. దీంతో బాలీవుడ్ లో చేసిన సినిమాలు వర్కవుట్ కాకపోవడంతో అబ్బాస్ గ్రాఫ్ డౌన్ అవుతూ వచ్చింది. ఆఖరికి తెలుగు సినిమాల్లో కూడా అతిధి పాత్రలు చేయడం ప్రారంభించాడు. చివరకు అవి కూడా దొరకకపోవడంతో న్యూజిలాండ్‌కు వెళ్లి అక్కడ పెట్రోలు పంప్‌లో పనిచేయడం ప్రారంభించాడు అబ్బాస్. బాలీవుడ్ లో కంటే దక్షిణాదిలోనే అబ్బాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ.. ఆ విషయాన్ని మరిచిపోయి కెరీర్ ను నాశనం చేసుకున్నాడు అబ్బాస్.
Also Read : జాక్ పాట్ కొట్టేశాడు.. తమిళ బిగ్ బాస్ 8 విజేతగా యూట్యూబర్