/rtv/media/media_files/2025/04/13/X9m6ezRFc6iX3RGHbk2m.jpg)
Accident
ఆదిలాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జైనథ్ మండలం తరోడ దగ్గర్లో బుధవారం తెల్లవారుజామున కారు బోల్తా పడింది. ఈ దుర్ఘటలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను జిల్లా కేంద్రంలోని రిమ్స్ మార్చురీకి తరలించారు. గాయాలపాలైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. మృతులు ఆదిలాబాద్‌లోని లక్ష్మీనగర్, జైజవాన్ నగర్ వాసులుగా గుర్తించారు. మహారాష్ట్రలో వారు మేస్త్రీ పనికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Follow Us