/rtv/media/media_files/2025/05/21/BnNQZblRPMKCEqqVCrFW.jpg)
ranya Photograph: (ranya)
Ranya rao: కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ వివాదంలో కర్ణాటక హోంమంత్రి పర్వమేశ్వరకు సంబంధం ఉన్నట్లు ఈడీ గుర్తించింది. రన్యారావుతో ఆర్ధిక లావాదేవీలు జరిపినట్లు నిర్ధారించి పరమేశ్వర విద్యా సంస్థల్లో సోదాలు చేపట్టింది.
#BREAKING The Enforcement Directorate (ED) is conducting raids and inspections at Siddhartha Institute of Technology and Siddhartha Medical College in Tumakuru, owned by Karnataka's Home Minister G. Parameshwara. The operation began around 9:30 AM today, with five teams involved… pic.twitter.com/n8wFQgjd3I
— IANS (@ians_india) May 21, 2025
ఈ మేరకు హోమంత్రి పరమేశ్వర సిద్ధార్ధ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఛైర్మన్‌గా ఉన్నారు. అయితే ఆయన విద్యాసంస్థలకు రన్యారావుకు మధ్య ఆర్ధిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన ఈడీ దాడులు జరిపింది. సిద్ధార్ధ కాలేజీ నగదు లావాదేవీలను పరిశీలించింది. ఈ సమయంలో పరమేశ్వర ఇంట్లో లేరని తెలుస్తోంది. ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన పనుల్లో నిమిగ్నమైనట్లు సమాచారం.
Also Read: 50 బుల్డోజర్లు, 3 వేల మంది పోలీసులు.. 8,500 ఇళ్లు ఫసక్!
ఇక రన్యారావు పెళ్లికి సీఎం సిద్ధ రామయ్య, హోమంత్రి పరమేశ్వర కూడా వెళ్లడం సంచలనంగా మారింది. దీంతో రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు రాజకీయ మలుపు తిరిగింది. ఈ స్మగ్లింగ్ కేసులో కాంగ్రెస్ నేతలకు సంబంధాలు ఉన్నాయంటూ బీజేపీ ఆరోపిస్తోంది. కానీ ఆ ఆరోపణను కాంగ్రెస్ ఖండించింది. బీజేపీ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, కేవలం అవి అసత్య ప్రచారాలేనని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కొట్టిపారేశారు. ఇదిలా ఉంటే.. బెంగళూరు కోర్టు రన్యాకు బెయిల్ ఇచ్చింది.
Kannada Actress Ranya Rao | gold | home-minister