తెలంగాణలోని రంగారెడ్డిలో మరో పరువు హత్య ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డికి చెందిన మహిళా కానిస్టేబుల్ నాగమణి హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో విధుల నిర్వహిస్తోంది. కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా నెల రోజుల కిందట నాగమణి కులాంతర వివాహం చేసుకుంది. తమ మాట వినకుండా కులాంతర వివాహం చేసుకుందని ఆగ్రహంతో నాగమణి సోదరుడు నడిరోడ్డుపై ఆమెను కత్తితో పొడిచి చంపాడు. ఇబ్రహీంపట్నంలో ఆమె మెడపై కత్తితో పొడిచి హత్య చేశాడు.
ఇది కూడా చూడండి: పుష్ప-2పై టీడీపీ ఎంపీ ట్వీట్.. వెంటనే డిలీట్
భార్యనే చంపాలని..
ఇదిలా ఉండగా ఇటీవల ఓ భర్త డబ్బుకోసం తన భార్యను కాల్చిన దారుణ ఘటన ఏపీలో చోటుచేసుకుంది. విశాఖపట్నంలోని మురళీనగర్ సింగరాయ కొండపై వెంకటరమణ, కృష్ణవేణి దంపతులు నివశిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇక వెంకటరమణ మద్యానికి బానిస కావడంతో అప్పులు బాగా ఉన్నాయి. అదే సమయంలో భార్య బంగారాన్ని సైతం తాకట్టు పెట్టాడు. దీని కారణంగానే తరచూ భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇక నవంబర్ 23న కూతురి పుట్టిన రోజు నాటికి బంగారాన్ని విడిపించి తీసుకురావాలని భార్య తల్లిదండ్రులు పట్టుబట్టారు.
ఇది కూడా చూడండి: మహిళలకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
దీంతో ఏం చేయాలో తెలియని వెంకటరమణ తన భార్యను హతమార్చాలనుకున్నాడు. దీంతో నవంబర్ 16న రాత్రి తాగొచ్చి తనతో పాటే మత్తుమందు కలిపి తెచ్చిన కూల్‌డ్రింక్‌ను భార్యకు ఇచ్చాడు. ఆమె తాగి వెంటనే కళ్లుతిరిగి పడిపోయింది. దీంతో అతడు తనతో తెచ్చుకున్న మంటలు అంటుకునే పొడిని ఆమెపై చల్లి నిప్పంటిచ్చాడు. తలుపులు మూసేశాడు.
ఇది కూడా చూడండి: విషాదం.. అభిమానుల మధ్య ఘర్షణ.. వందమందికి పైగా..
కళ్ల ముందే భార్య కాలిపోతున్నా తలుపులు తీయలేదు. ఇక మత్తు ప్రభావం నుంచి అప్పుడే కోలుకుంటున్న ఆమె వెంటనే తనకు అంటుకున్న మంటలు చూసి ఒక్కసారిగా అరిచింది. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉండటంతో.. జరిగిన విషయాన్ని చెప్పటంతో పోలీసులు రంగంలోకి దిగి వెంకటరమణపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
ఇది కూడా చూడండి: ముంబైలో దారుణం.. యువతి బట్టలు విప్పించి డిజిటల్ అరెస్ట్..