BIG BREAKING: పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం.. ఒకరు మృతి.. అనేక మందికి..

విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం చోటుచేసుకుంది. ఠాగూర్ లేబొరేటరీస్‌లో విషవాయువులు లీక్ కావడంతో ఒకరు మృతి చెందగా చాలామంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది.

New Update
Air Pollution

విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం చోటుచేసుకుంది. ఠాగూర్ లేబొరేటరీస్‌లో విషవాయువులు లీక్ కావడంతో ఒకరు మృతి చెందారు. అనేక మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Ajahn Siripanyo: బౌద్ధ సన్యాసిగా మారిన 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు

హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే  హానికరమైన గ్యాస్ లీక్ కావడంతో..

రియాక్టర్‌ కమ్‌ రిసీవర్‌ ట్యాంక్‌ నుంచి లిక్విడ్‌ హెచ్‌సీఎల్‌ లీక్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. హానికరమైన హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ కావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో తొమ్మిది మంది కార్మికులకు శ్వాస, దగ్గు సమస్యలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాద ఘటనలో మృతి చెందిన వ్యక్తి ఒడిశాకి చెందినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: నెల్లూరు టీడీపీలో ఫైట్.. మంత్రి నారాయణ Vs ఎమ్మెల్యే కోటంరెడ్డి!

ఈ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీశారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ కావడంతో అస్వస్థతకు గురైన వారికి మెరుగైన చికిత్స అందించాలని తెలిపారు. వారికి చికిత్స ఎంత వరకు వచ్చిందని చంద్రబాబు స్వయంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

ఇది కూడా చూడండి: TG crime: తెలంగాణలో షాకింగ్ ఘటన.. రన్నింగ్ ట్రైన్లో వృద్ధురాలిని రేప్ చేసి.. !

ఈ ప్రమాద ఘటనపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషవాయువు లీకై, ఒక కార్మికుడు చనిపోగా, అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఈ ప్రమాద ఘటనలో మృతి చెందిన కార్మికుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చూడండి: TG crime: ఇళ్లు కోసం వచ్చారు.. ఇద్దర్ని చంపారు.. ఖమ్మంలో కలకలం

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు