హైదరాబాద్ మై హోం భుజలో దారుణం ఒడిశాకి చెందిన ఓ మహిళ సరోగసి కోసం హైదరాబాద్‌లోని రాజేష్‌తో రూ.10 లక్షలకి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో అతన్ని కలవడానికి రాయదుర్గంలోని మైహోం భుజలో అతని అపార్ట్‌మెంట్‌కి వెళ్తే బంధించాడు. అక్కడి తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. అపార్ట్‌మెంట్ నుంచి కింద పడి మరణించింది. By Kusuma 27 Nov 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఒడిశాకి చెందిన అశ్విత సింగ్ సరోగసి కోసం రాజేష్ అనే వ్యక్తి హైదరాబాద్‌కి తీసుకొచ్చాడు. సరోగసి ద్వారా పిల్లలను కనడానకి రూ.10 లక్షలు ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో రాజేష్‌ను కలవడానికి హైదరాబాద్ రాగా.. రాయదుర్గంలోని మైహోం భుజలో ఆమెను కొన్ని బంధించాడు. ఇది కూడా చూడండి: TG crime: ఇళ్లు కోసం వచ్చారు.. ఇద్దర్ని చంపారు.. ఖమ్మంలో కలకలం గత కొన్ని రోజుల నుంచి బంధించడంతో.. అశ్విత సింగ్‌ను ఇబ్బంది పెట్టడంతో ఆమె పారిపోవడానికి ప్రయత్నించింది. తొమ్మిదో అంతస్థులో ఉన్న ఆమె చీర సాయంతో పారిపోవడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆరో అంతస్థులోకి దిగే ప్రయత్నం చేస్తుండగా అశ్విత సింగ్ అదుపు తప్పి పడిపోయింది. దీంతో అక్కడిక్కడే మృతి చెందింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఇది కూడా చూడండి: Ajahn Siripanyo: బౌద్ధ సన్యాసిగా మారిన 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు ఇదిలా ఉండగా.. ఇటీవల మణుగూరు రైలులో కూడా ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. కూతురును చూసేందుకు మణుగూరు ప్యాసింజర్ రైలులో ప్రయాణం చేస్తున్న మహిళను దివ్యాంగుల బోగీలోని బాత్‌రూంలో మెడ చుట్టూ తువ్వాలు బిగించి ఊపిరాడకుండా చేసి ఓ దుండగుడు చంపాడు. ఈ ఘటనపై విచారణ చేసిన పోలీసులు నిందితులు గుర్తించి పట్టుకున్నారు. ఇది కూడా చూడండి: TG crime: తెలంగాణలో షాకింగ్ ఘటన.. రన్నింగ్ ట్రైన్లో వృద్ధురాలిని రేప్ చేసి.. ! వెంటనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఒంటరిగా ప్రయాణం చేస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకున్న నిందితుడు అత్యాచారం చేసి, చంపేస్తున్నాడు. అంతే కాకుండా వారి దగ్గర ఉన్న నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను కూడా తీసుకుని పారిపోతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇది కూడా చూడండి: నెల్లూరు టీడీపీలో ఫైట్.. మంత్రి నారాయణ Vs ఎమ్మెల్యే కోటంరెడ్డి! #death మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి