/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Death-jpg.webp)
Mancherial district Crime
Mancherial Crime : కోడి కాలికి కట్టిన కత్తి ఓ మనిషి ప్రాణాలను తీసింది. ఈ విషాద ఘటన మంచిర్యాల (Mancherial district) జిల్లా కన్నెప్పల్లి మండలం బొత్తపల్లిలో గ్రామంలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: అతిగా బ్రష్ చేస్తే దంతాలకు ప్రమాదమా..?
ప్రాణం తీసిన కోడి కత్తి
అయితే బొత్తపల్లిలో గ్రామంలో దసరా పండగ సందర్భంగా గుట్టుచప్పుడు కాకుండా ఊళ్ళో కోడి పందేలు నిర్వహించారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మదనయ్య (42) కోడి కాలికి కత్తి కడుతుండగా అది ఒక్కసారిగా పైకి ఎగిరింది. దీంతో కోడి కాలికి కట్టిన కత్తి కాస్త అతని మోచేతికి తగిలి నరం తెగింది. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. మార్గం మధ్యలోనే మదనయ్య ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరీశీలించారు.
Also Read : డిప్యూటీ సీఎంలిద్దరూ ఆన్ ఫైర్!
Also Read: పిల్లల్ని కంటావా?..మీ చెల్లితో పెళ్లి చేస్తావా? భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం..