TG Crime: పసిగుడ్డును చంపేసిన కసాయి తల్లి.. గొంతు నులిమి, నీటి గుంతలో పడేసి!

నాగర్‌కర్నూల్ చెన్నంపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఎల్లమ్మ అనే మహిళకు తన ఏడేళ్ల కూతురిని గొంతులు నులిమి చంపేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని నీటి మడుగులో పడేసింది. కూతురిని  మాత్రమే కాదు గతంలో ఎల్లమ్మ తన భర్తను కూడా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

New Update
Nagar Kurnool incident mother killed daughter

Nagar Kurnool incident mother killed daughter

TG Crime: కన్న బిడ్డ అనే కనికరం లేకుండా ఏడేళ్ళ కూతురిని గొంతు నులిమి చంపేసింది కసాయి తల్లి. ఆ తర్వాత మృతదేహాన్ని నీటి మడుగులో పడేసింది.  ఈ కిరాతకమైన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగింది. 

కన్న కూతురిని 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన ఎల్లమ్మ  అనే మహిళ తన  ఏడేళ్ల కూతురిని గొంతులు నులిమి చంపేసింది. అనంతరం మృతదేహాన్ని ఇంటి ఆవరణలోని ఓ నీటి గుంతలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే.. కూతురిని కిరాతకంగా హత్య చేయడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. తల్లి అనే పదానికే మాయని మచ్చ తెచ్చిందంటూ గ్రామా ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్న్నారు. 

భర్తను కూడా హత్య

 అయితే పోలీసుల విచారణలో మరో షాకింగ్ విషయం బయటపడింది. ఎల్లమ్మకు ఇదేమి మొదటి నేరం కాదు. గతంలో తన భర్తను కూడా హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ నేరం పై కొంతం కాలం జైలు జీవితం కూడా గడిపి.. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చింది. మరి మళ్ళీ ఏమైందో.. కానీ ఆదివారం రాత్రి కూతురిని గొంతు పిసికి చంపేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 

telugu-news | latest-news | nagar-kurnool-district

Also Read: Miss World 2025: ప్రపంచ దృష్టి మొత్తం హైదరాబాద్ వైపే.. ఈరోజు మిస్ వరల్డ్ హెడ్ టూ హెడ్ ఛాలెంజ్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు