/rtv/media/media_files/2025/10/08/kills-wife-2025-10-08-21-23-04.jpg)
ఓ వ్యక్తికి అతని అత్తతో అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో అడ్డుగా ఉన్న భార్యను హత్య చేశాడు. తర్వాత అతని కుటుంబంతో కలిసి అత్తని తీసుకొని పారిపోయాడు. అత్తతో రిలేషన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటపడ్డాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ కాస్‌గంజ్ జిల్లాలో ఈ షాకింగ్ సంఘటన జరిగింది.
సిధ్‌పురాలో నివసించే ప్రమోద్‌కు 20 ఏళ్ల శివానికి 2018లో పెళ్లి జరిగింది. అయితే శివాని తల్లి అయిన అత్తతో ప్రమోద్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. కాగా, రెండు రోజుల కిందట శివాని, ప్రమోద్ మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. దీంతో భార్యను అతడు హత్య చేశాడు. ఆ తర్వాత తన కుటుంబంతో కలిసి పారిపోయాడు.
మరోవైపు శివాని అనుమానాస్పదంగా మరణించినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆమె ఇంటికి చేరుకున్నారు. ప్రమోద్‌కు అత్తతో వివాహేతర సంబంధం ఉన్నదని శివానీ కుటుంబ సభ్యులు ఆరోపించారు. వీరిద్దరి రిలేషన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శివాని కుటుంబం ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.