MH: నాగ్ పూర్ అల్లర్లలో దారుణం..మహిళా కానిస్టేబుల్ పై లైంగికదాడి

రెండు రోజుల క్రితం జరిగిన నాగ్ పూర్ అల్లర్లో దారుణాలు చోటు చేసుకున్నాయి. మతోన్మాద గుంపులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో వారిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్ పై నిందితులు లైంగికదాడికి యత్నించారు.

author-image
By Manogna alamuru
New Update
MH

Clash Erupts In Nagpur Amid Aurangzeb Tomb

నాగ్ పూర్ లో మతోన్మాద గుంపు, అల్లరి మూకలు కలిసి విధ్వంసం సృష్టించారు. ఇళ్ళు, వాహనాలు తగులబెట్టారు. వీధుల్లోకి వచ్చి నినాదాలు చేస్తూ హింసకు తెగబడ్డారు.  ఒక వర్గం ఇళ్లను, ఆస్తుల్ని లక్ష్యంగా చేసుకుంటూ దాడులు నిర్వహించారు. నాగ్‌పూర్ నగరాన్ని కుదిపిపేసిన ఈ హింసాకాండలో అల్లరి మూక చాలా ఘోరంగా ప్రవర్తించారని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. 

మహిళా కానిస్టేబుల్ పై లైంగిక దాడి..

నాగ్ పూర్ లో భల్దార్ పూరా ప్రాంతంలోని అల్లరి మూగను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆ సమయంలో నిందితులు ఒక మహిళా కానిస్టేబుల్ తో అసభ్యంగా  ప్రవర్తించినట్లు తెలుస్తోంది. లేడీ కానిస్టేబుల్ బట్టలను చింపి...ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించారు.  దీనిపై దర్యాప్తు చేసిన గణేష్ పేట్ పోలీసులు అల్లరిమూకపై కేసు నమోదు చేశారు. ఇది చాలా దారుణమైన విషయమని..ఇందులో ప్రమేయం ఉన్న ప్రతీ ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం మహిళా పోలీస్ అధికారిని అల్లరి మూక కార్నర్ చేసి లైంగికంగా వేధించారు. అయితే వెంటనే తోటి పోలీస్ సిబ్బంది వచ్చి ఆమెను రక్షించి, సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. అంతేకాదు వీరు నలుగురు డీసీపీలపై, పోలీస్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. మహిళా అధికారిపై లైంగిక దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

 రెండు రోజుల క్రితం మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో చెలరేగిన హింస, మతఘర్షణలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అల్లర్లకు కారణమైన వ్యక్తి స్థానిక రాజకీయ నాయకుడని పోలీసులు తెలుసుకున్నారు. రెండు వర్గాల మధ్య గొడవకు కారణమైన ప్రధాన నింధితుడు ఫహీమ్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ని శుక్రవారం వరకు కస్టడీలోనే ఉంచనున్నారు. ఫహీమ్ ఖాన్ మైనారిటీ డెమోక్రటిక్ పార్టీకి చెందిన లోకల్ లీడర్.

Also Read: Hit Man: ఐపీఎల్ కు ముందు మాల్దీవుల్లో రోహిత్ శర్మ చిల్..

Advertisment
తాజా కథనాలు