Crime: ఛీ.. ఛీ వీడు మనిషేనా! పదేళ్ల బాలికను రేప్ చేసి.. ఆ తర్వాత

మహారాష్ట్ర ఠాణే నగరంలో దారుణం జరిగింది. ఇరవై ఏళ్ళ యువకుడు పదేళ్ల బాలికను ఎత్తుకెళ్ళి లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం గొంతుకోసి చంపాడు. అనంతరం బాలిక మృతదేహాన్ని ఆరో అంతస్తులోని తన ఫ్లాట్ కి తీసుకెళ్లి బాత్రూమ్ కిటికీ నుంచి బయటకు విసిరేసాడు.

New Update
Maharashtra thane  brutal incident

Maharashtra thane brutal incident

Crime: మహారాష్ట్ర ఠానే నగరంలో మరో కామాంధుడి కిరాతకం బయటపడింది. పదేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి ఆపై గొంతు కోసి చంపినా ఘటన వెలుగులోకి వచ్చింది.  పోలీసుల వివరాల ప్రకారం.. ఆసిఫ్ మన్సూరీ అనే ఇరవై ఏళ్ళ యువకుడు సామ్రాట్‌నగర్‌ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నాడు. అయితే సోమవారం రాత్రి తన సమీప భవనంలో  నివాసం ఉండే పదేళ్ల బాలికకు ఆటవస్తువులు ఆశ చూపించి ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం ఆ చిన్నారి పట్ల  అత్యంత కిరాతకంగాప్రవర్తించాడు. బాలికపై అత్యాచారం చేసి ఆపై గొంతుకోసి చంపాడు. అనంతరం  బాలిక మృతదేహాన్ని ఆరో అంతస్తులోని తన ఫ్లాట్ కి తీసుకెళ్లి బాత్రూమ్ కిటికీ నుంచి బయటకు విసిరేసాడు. బాలిక పోస్టుమార్టంలో ఆమెపై అత్యాచారం జరిగినట్టు బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

 

telugu-news | crime news | maharastra | latest-news

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు