/rtv/media/media_files/2025/09/08/little-boy-washed-away-after-falling-into-mori-canal-1-2025-09-08-10-18-17.jpg)
little boy washed away after falling into Mori canal
వర్షాకాలం వచ్చిందంటే చాలామందికి సంతోషం కలుగుతుంది. ముఖ్యంగా పిల్లలు వర్షంలో ఆడుకోవడానికి ఇష్టపడతారు. అయితే, ఈ సమయంలో చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో నీరు చేరిన ప్రదేశాలు, మురుగు కాలువలు, లోతైన గుంటలు చాలా ప్రమాదకరంగా మారతాయి. చిన్న పిల్లలు ఆడుకుంటూ తెలియకుండా ఈ ప్రదేశాల్లోకి వెళ్లడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి, వర్షాకాలంలో పిల్లలను నీరు ఉన్న ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లనివ్వకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
అంతేకాకుండా వర్షాకాలంలో చాలా చోట్ల వరద నీరు నిలిచిపోతుంది. రోడ్లపై, ఖాళీ స్థలాల్లో, ఇళ్ల ముందు కూడా నీరు చేరి ఉంటుంది. అలాగే మురుగు కాలువలు, మ్యాన్‌హోల్స్ నీటిలో మునిగిపోవడం వలన అవి కనిపించవు. దీంతో పిల్లలు ఆడుకుంటూ ఈ నీటిలోకి వెళితే, వాటిలో దాగి ఉన్న ప్రమాదాల గురించి వారికి తెలియదు. అప్పుడు పిల్లలు వాటిలో పడిపోయే ప్రమాదం ఉంది. తాజాగా అలాంటి విషాదకర ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో ప్రకారం.. వర్షం పడుతున్న సమయంలో ముగ్గురు చిన్నారులు రోడ్డుపై ఆడుకోవడానికి వెళ్లారు. అక్కడే రోడ్డు పక్కనే ఒక ఇంటి ముందు ఉన్న కాలువలో వాటర్ స్పీడ్‌గా వెళ్తుంది. దాన్ని చూడ్డానికి ఆ ముగ్గురిలో ఒక బాలిక, మరొక బాలుడు వెళ్లారు. అయితే నీళ్లు ఎక్కువగా ఉండటంతో కాలువ కానిపించలేదు. దీంతో ఆ చిన్నారి బాలుడు అందులో మునిగిపోయి.. కొట్టుకుపోయాడు.
ఇంతలో అక్కడికి చేరుకున్న మరో బాలుడు ఒక్కసారిగా షాకయ్యాడు. వెంటనే బాలిక, బాలుడు కలిసి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడానికి పరిగెత్తారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది తెలియలేదు. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసి చాలా మంది నెటిజన్లు పేరెంట్స్‌కు సూచనలు ఇస్తున్నారు. వర్షాకాలంలో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతున్నారు.
दुखद 💔
— 𝙼𝚛 𝚃𝚢𝚊𝚐𝚒 (@mktyaggi) September 7, 2025
बरसात में छोटे बच्चों को अकेले ऐसी जगह बिल्कुल न जाने दें, जहाँ पानी भरा हो… 🙏🌧️ pic.twitter.com/ejjP7Z927L
పేరెంట్స్ తీసుకోవలసిన జాగ్రత్తలు
వర్షాకాలంలో పిల్లలు బయట ఆడుకుంటున్నప్పుడు వారిని తప్పనిసరిగా పెద్దలు పర్యవేక్షించాలి. వారికి దగ్గరగా ఉండి జాగ్రత్తలు చెప్పాలి.
నీరు నిల్వ ఉన్న ప్రదేశాలు ఎంత ప్రమాదకరమో పిల్లలకు అర్థమయ్యేలా తెలియజేయాలి. వాటికి దూరంగా ఉండమని చెప్పాలి.
వర్షం లేనప్పుడు కూడా పిల్లలను ఆడుకోవడానికి సురక్షితమైన ప్రదేశాలకు మాత్రమే పంపించండి.
నీటిలో పడిపోయినప్పుడు ఎలా ప్రవర్తించాలో, ఎవరి సహాయం కోరాలో పిల్లలకు నేర్పించండి. స్విమ్మింగ్ తెలిసిన పిల్లలకు కూడా వర్షపు నీటిలో ఈత కొట్టవద్దని చెప్పాలి.
ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా, వర్షాకాలంలో పిల్లలను ప్రమాదాల బారి నుంచి రక్షించవచ్చు.