/rtv/media/media_files/2025/07/03/christina-formella-2025-07-03-20-31-49.jpg)
అమెరికాలో ఓ మహిళా టీచర్.. 15 ఏళ్ల స్టూడెంట్‌తో 50 సార్లు శృంగారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. చికాగోలోని డౌనర్స్ గ్రూవ్ సౌత్ హైస్కూల్‌లో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. విద్యార్థి ఫోన్‌లో టీచర్ నుంచి వచ్చిన అసభ్యకరమైన మెసేజ్‌లు కనడపడంతో అతని తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో ఆ మహిళా టీచర్‌ను అరెస్టు చేసి, స్కూల్ నుంచి తీసివేశారు. నిందితురాలిని మహిళా టీచర్ 30 ఏళ్ల క్రిస్టినా ఫోర్మెల్లాగా గుర్తించారు. ఆమెపై లైంగిక దాడి, నేరపూరిత శృంగారం కేసులు నమోదు చేశారు. వీటితో పాటు మరో 52 అభియోగాలు కూడా మోపారు.
NUEVO: Al esposo de la maestra de Illinois Christina Formella le preguntan directamente sobre cómo se siente acerca de que su esposa supuestamente se acueste con un niño en su propia casa. Brutal. El marido de Formella sigue con ella después de que se revelara que supuestamente… pic.twitter.com/k3NUGBkswm
— Michael Rodriguez 𝕏 (@michaelmjs) July 3, 2025
కేసు విచారణలో భాగంగా ఆ టీచర్ తన భర్తతో కలిసి కోర్టుకు వచ్చింది. ఆమె ఫ్యామిలీ క్రిస్టినాకు అండగా నిలిచింది. స్టూడెంట్‌తో శృంగారం చేయలేదని క్రిస్టినా కోర్టులో పేర్కొన్నది. బాధిత విద్యార్థికి సుమారు 5000 ఫీట్ల దూరంలో నిందితురాలు ఉండాలని కోర్టు తన తీర్పులో ఆదేశించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ మహిళా టీచర్ మరో కోర్టును ఆశ్రయించింది. ఒకే వీధిలో ఉండడం వల్ల ఆ దూరాన్ని 2500 ఫీట్లకు తగ్గించాలని ఆమె కోర్టును కోరింది. కానీ కోర్టు దాన్ని అంగీకరించలేదు. ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. ఈ కేసులో ఒకవేళ టీచర్ క్రిస్టినా దోషిగా తేలితే ఆమెకు 60 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది.