ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే..

కర్నూలు జిల్లాలో నందపురం మండలంలోని ధర్మపురం దగ్గర ఓ కారు స్పీడ్‌గా ఆటోను ఢీకొట్టి పొలంలో పడింది. దీంతో ఆటోలోని ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మృతి చెందారు. మంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

New Update

కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎమ్మిగనూరు, నందవరం మండలంలోని ధర్మపురం దగ్గర యాక్సిడెంట్ జరిగింది. ఆటోను కారు వెనుక నుంచి స్పీడ్‌గా ఢీకొట్టి.. పొలాల్లోకి పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మృతి చెందారు. ఇంకా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి: Health Benefits: ఉదయాన్నే ఈ జావ తాగితే.. అనారోగ్య సమస్యలన్నీ మటాష్

కోదాడ, విజయవాడ హైవేపైన..

ఇదిలా ఉండగా.. కోదాడ, విజయవాడ హైవేపై కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు తీవ్రగాయాల పాలవ్వగా...నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ దారుణ ఘటన  సూర్యాపేట జిల్లా  కోదాడ  జాతీయ రహదారిపై కట్టకొమ్ముగూడెం వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. 

ఇది కూడా చూడండి: కార్తీక మాసంలో ఈ పనులు చేస్తే.. దరిద్ర మంతా మీ ఇంట్లోనే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్ నుంచి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు విజయవాడ వైపు వెళ్తుంది. ఈ క్రమంలోనే కోదాడ  సమీపంలోకి వచ్చిన తరువాత డ్రైవర్ విశ్రాంతి కోసం బస్సును రోడ్డు పక్కకు నిలిపాడు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన టీఎస్ ఆర్టీసీ బస్సు , ప్రైవేటు ట్రావెల్స్  బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో ఆర్టీసీ బస్సు పూర్తిగా ధ్వంసం అయ్యింది. 

ఇది కూడా చూడండి: Vaishnavi Chaithanya: దీపాల వెలుగులో బేబీ బ్యూటీ.. ఎంత అందంగా ఉందో..!

శీతాకాలం ప్రారంభమవుతుందంటే.. చాలా చోట్ల మంచు కారణంగా యాక్సిడెంట్లు జరుగుతాయి. మంచు వల్ల ముందు వాహనం ఉందా? లేదా? అని విషయం సరిగ్గా తెలియకపోవడం వల్ల వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. మంచులో ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.    

ఇది కూడా చూడండి: Spain Floods: స్పెయిన్ వరద బీభత్సం.. 205కి చేరిన మృతుల సంఖ్య

Advertisment
Advertisment
తాజా కథనాలు