/rtv/media/media_files/2025/02/02/WcOS2gK177MFp6UJCzwo.jpg)
BUS ACCIDENT
Kurnool Accident: ఉమ్మడి కర్నూల్ జిల్లాలో ఒకేరోజు రెండు వేర్వేరు చోట్ల ఘోర బస్సు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆలూరు జిల్లాలో బస్సు డ్రైవర్ కి గుండెపోటు రావడంతో అదుపు తప్పిన బస్సు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందగా.. పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బస్సు లో నుంచి ప్రయాణికులను బయటకు పంపారు.
Also Read: POOJA HEGDE: సహనం కోల్పోయిన పూజా హెగ్డే.. ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు ఏం చేసిందంటే?
ఆళ్లగడ్డలో మరో ప్రమాదం..
మరోవైపు అదే కర్నూల్ జిల్లాలోని ఆళ్లగడ్డలో మరో బస్సు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపు తప్పిన చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రెండు ప్రమాదాలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.