పుష్ప సినిమా తరహాలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఘటన కుమురం భీం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కుమురం భీం జిల్లాలోని వాంకిడికి చెక్ పోస్ట్ దగ్గర అక్రమంగా గంజాయిని తరలిస్తున్న వారిని పట్టుకున్నారు. రాజమహేంద్రవరం నుంచి మధ్యప్రదేశ్‌కు వెళ్తున్న ఒక ట్యాంకర్ లారీ డ్రైవర్ అనుమానస్పదంగా కనిపించారు. దీంతో వాంకిడి చెక్‌పోస్ట్ దగ్గర వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు.
ఇది కూడా చదవండి: జగన్ కు బిగ్ షాక్.. మీటింగ్ మధ్యలోనే అలిగి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే
సినిమాల లెవల్‌లో ప్లానింగ్..
పుష్ప సినిమాలో ఎలా పాల ట్యాంకర్‌లో ఎర్రచందనం తరలించారో.. అలాగే ట్యాంకర్ మధ్యలో గంజాయి పెట్టారు. ప్రత్యేకంగా తయారు చేసిన ట్యాంకర్ మధ్యలో దాదాపుగా 290 కిలోల గంజాయిని గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ దాదాపుగా రూ.72.50 లక్షలు ఉంటుందట.
ఇది కూడా చదవండి: TG Train: తెలంగాణ రైలు ప్రయాణికులకు శుభవార్త.. మరో రెండు కొత్త లైన్లు!
డ్రైవర్‌తో పాటు మరికొందరిని అరెస్టు చేశారు. అయితే ఈ గంజాయిని ఎక్కడ నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీని వెనుక ఉన్న ముఖ్య పాత్రదారులు ఎవరనే విషయంపై కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ కాస్త ఆందోళనగా ఉండటం గమనించి పోలీసులు గంజాయి ఉన్నట్లు గుర్తించారట. అయితే దీని వెనుక ఎవరున్నారనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: అమెరికా ఎన్నికలకు ముందే అణుబాంబు దాడి.. ఇరాన్ బిగ్ ప్లాన్!
ప్రస్తుతం గంజాయి ముఠాలు పెరుగుతున్నారు. పోలీసులు కళ్లు కప్పి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రాల సరిహద్దుల్లో ఎక్కువగా ఈ ఘటనలు కనిపిస్తున్నాయి. పోలీసులకు అనుమానం రాకుండా ఇలా ట్యాంకర్లలో పెట్టి తరలిస్తున్నారు. ఇలాంటి ఘటనలతో పోలీసులు కూడా అప్రమత్తమవుతున్నారు.
ఇది కూడా చదవండి: ప్రెసిడెంట్ అయ్యేనాటికి యుద్ధం ముగియాలి–ఇజ్రాయెల్‌కు చెప్పిన ట్రంప్