కేరళలోని కసర్‌గోడ్ జిల్లాలో ఓ ఆలయంలో విషాధ ఘటన చోటుచేసుకుంది. నీలేశ్వర ఆలయంలో జరిగిన ఉత్సవాల్లో టపాసులు కాల్చారు. ఇవి పక్కనే ఉన్న బాణాసంచాపై పడటంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 150 మందికి పైగా గాయపడగా.. 8 మంది పరిస్థితి తీవ్రంగా ఉంది. గాయపడిన క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇది కూడా చూడండి: 'రచ్చ గెలిచి ఇంట గెలిచాను'.. ఏఎన్‌ఆర్ జాతీయ అవార్డు వేడుకల్లో చిరంజీవి
బాణాసంచా పేలడంతో..
కసర్‌గోడ్‌లో ఉన్న నీలేశ్వరం ఆలయంలో థేయంకట్ట మహోత్సవాలు జరుగుతున్నాయి. వీటిని చూడటానికి ప్రజలు భారీ సంఖ్యలో వెళ్లారు. ఈ వేడుకల్లో బాణాసంచా కాల్చడంతో అది వేరే గదిలోకి వెళ్లింది. అప్పటిగే ఆ గదిలో బాణాసంచా నిల్వ ఉంచడతంతో ఈ పేలుడు సంభవించింది. ఎక్కువ మంది జనం ఉండటం వల్ల పేలుడు తర్వాత తప్పించుకోవడానికి ప్రయత్నించగా తొక్కిసలాట జరిగింది. దీంతో 150 మందికి పైగా గాయపడ్డారు.
ఇది కూడా చూడండి: ధంతేరాస్ స్పెషల్.. 10 నిమిషాల్లో బంగారం, వెండి డెలివరీ
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి వెళ్లారు. పోలీసులు, స్థానికులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే బాణా సంచా కాల్చడానికి ఆలయంలో ఎలాంటి అనుమతి లేకుండానే చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆలయ అధ్యక్షుడు, కార్యదర్శిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చూడండి: చైనాలో వేలాది స్కూల్స్ మూసివేత.. ఎందుకో తెలిస్తే షాక్
ఇదిలా ఉండగా.. ఇటీవల హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మయూర్ పాన్‌షాపు దగ్గరలోని క్రాకర్స్ షాపులో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. క్రాకర్స్‌కు అంటుకోవడంతో ఆ మంటలు మరింతగా ఎగిసిపడ్డాయి.
ఇది కూడా చూడండి: Chiruచిరు వర్సెస్ మోహన్ బాబు..మరోసారి తెరపైకి లెజెండరీ అవార్డు వివాదం