/rtv/media/media_files/2026/01/24/us-crime-2026-01-24-14-47-57.jpg)
Family disputes in America
America: కుటుంబ కలహాలు అమెరికాలో నలుగురి ప్రాణాలు బలి తీసుకున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవ ముదరడంతో భర్త కోపంలో గన్‌తో ఫైరింగ్ చేశాడు. తన భార్యతో పాటు మరో ముగ్గురు బంధువులను కాల్చి చంపిన దారుణ ఘటన జార్జియా రాష్ట్రంలో వెలుగు చూసింది. జార్జియాలోని లారెన్స్‌విల్లే నగరంలో శుక్రవారం ఉదయం ఈ మారణహోమం చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన విజయ్ కుమార్ (51) తన భార్య మీను డోగ్రా (43)తో కలిసి అట్లాంటాలో నివసిస్తున్నారు. అయితే, వీరిద్దరి మధ్య అట్లాంటాలోని వారి నివాసంలోనే వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత వారు తమ 12 ఏళ్ల కుమారుడిని తీసుకుని సమీపంలోని బ్రూక్ ఐవీ కోర్ట్ ప్రాంతంలో ఉంటున్న తమ బంధువుల ఇంటికి వెళ్లారు.
Also Read: విద్యార్థులకు అస్వస్థత.. వాంతులతో ఆసుపత్రిలో చేరిక..
అక్కడ కూడా గొడవ సద్దుమణగకపోగా, తీవ్ర స్థాయికి చేరుకుంది. కోపంతో ఊగిపోయిన విజయ్ కుమార్ తన వద్ద ఉన్న తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మొత్తం నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భార్య మీను డోగ్రాతోపాటు బంధువులు గౌరవ్ కుమార్(33), నిధి చందర్ (37), హరీష్ చందర్ (38) లు చనిపోయారు. విజయ్ గన్‌తో కాల్పులు జరిపుతున్నప్పుడు ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారంతా అల్మారాలో దాక్కున్నారు. నిందితుడి 12 ఏళ్ల కుమారుడే ధైర్యం చేసి 911కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
Also Read: అమెరికాను వణికిస్తున్న మంచుతుపాన్ ..డేంజర్ లో 16 కోట్ల మంది
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి నలుగురు రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్నారు. కాల్పుల అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించిన విజయ్ కుమార్‌ను గ్వినెట్ కౌంటీ పోలీసులు ఇంటికి కొద్ది దూరంలోనే అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన ప్రవాస భారతీయులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అట్లాంటాలోని ఇండియన్ కాన్సులేట్ అధికారులు బాధితుల కుటుంబాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మృతులలో ఒకరు భారతీయ పౌరుడు ఉన్నారని, మిగిలిన వారు భారత సంతతికి చెందిన వారని ధృవీకరించారు.
Follow Us