/rtv/media/media_files/2025/11/17/ibomma-ravi-2025-11-17-10-32-14.webp)
Ibomma ravi
i BOMMA రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రవి దగ్గర దాదాపుగా రూ.300 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంత భారీ మొత్తంలో ఆస్తి ఉన్నప్పటికీ రవి ఈ డబ్బును వేర్వేరు విధాల్లో డిజిటల్ వాలెట్లలో దాచుకున్నట్లు తెలుస్తోంది. కోట్ల రూపాయల ఆస్తి కూడబెట్టిన రవి, డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కాకుండా కేవలం కిక్ కోసం హ్యాకింగ్ మొదలు పెట్టినట్లు విచారణలో తేలింది. అన్నింటి కంటే ముఖ్యంగా ఇతరుల కంటే ముందుగా సినిమా చూడాలనే కోరికతో హ్యాకింగ్ మొదలు పెట్టినట్లు సమాచారం. హ్యాకింగ్ మొదలు పెట్టి రవి కోట్లలో సంపాదించాడు. గవర్నమెంట్ వెబ్‌సైట్లను కూడా హ్యాక్ చేసి తన సత్తా చూపించాడు. రవి సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఎథికల్ హ్యాకర్‌గా బాగా నైపుణ్యం సంపాదించాడు.
ఇది కూడా చూడండి: Imadi Ravi: సాఫ్ట్‌వేర్ జాబు వదిలి.. పైరసీ కింగ్ పిన్‌గా ఇమ్మడి రవి.. సంచలన విషయాలు
రవికి సపోర్ట్ చేస్తూ..
ఇదిలా ఉండగా కొంతకాలంగా కరేబియన్ దీవుల్లో ఉంటూనే ఐబొమ్మ వెబ్‌సైట్‌ను రవి నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఫ్రాన్స్ నుంచి తాజాగా అతను హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులకు సమాచారం రావడంతో పక్కా ప్లాన్‌తో కూకట్‌పల్లిలో రవిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇతనికి సోషల్ మీడియాలో సోపోర్ట్ లభిస్తుంది. సినిమా టికెట్ల ధర అధికంగా ఉండటంతో పేద, మధ్యతరగతి ప్రజలు థియేటర్‌కు వెళ్లి సినిమా చూడలేకపోతున్నారు. ఇలాంటి వారికి ఐబొమ్మ రవి దేవుడు లాంటి వాడని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికైనా సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని సినిమా టికెట్ల ధరలు పెట్టాలని అంటున్నారు.
ఇది కూడా చూడండి: IBOMMA RAVI : ఐబొమ్మ రవికి మిడిల్‌క్లాస్ మద్దతు..ట్రెండింగ్‌లో 'ఐబొమ్మ'
Follow Us