ఐపీవో షేర్లు ఇస్తామంటూ.. సైబర్ నేరగాళ్లు ఏం చేశారంటే?

తక్కువ డబ్బుకే ఐపీవో షేర్లు ఇస్తామని సైబర్ నేరగాళ్లు హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి టోకరా వేశారు. గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్‌ గ్రూప్‌లో చేర్చి షేర్లు ఇస్తామని మొత్తం రూ.2.29 కోట్లు కాజేశారు.

New Update
FotoJet (13)

తక్కువ డబ్బులతో లాభాలు వచ్చే షేర్లు ఇస్తామని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. వివరాల్లోకి వెళ్తే బాచుపల్లికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి గుర్తు తెలియని కొందరు వ్యక్తుల నుంచి మెసేజ్ వచ్చింది. జులై 10వ తేదీన కేఎస్‌ఎల్ అఫీషియల్ స్టాక్‌ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపులో గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని చేర్చారు. కోటక్ సెక్యూరిటీస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌గా నారాయణ జిందాల్ పనిచేస్తున్నారు. షేర్ల క్రయవిక్రయాలు ఎలా చేయాలని నేర్పిస్తుంటానని,గ్రూప్‌లో ఎక్కువగా చాటింగ్ చేసేవారు. దీంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అతన్ని నమ్మడం మొదలు పెట్టాడు.

ఇది కూడా చూడండి: తాజ్‌ హోటల్‌లో జరిగిన ఉగ్రదాడిపై రతన్ టాటా ఏమన్నారంటే ?

ఐపీవో షేర్లు ఇస్తామంటూ..

కోటక్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ స్ట్రాటజీ ప్లాన్‌‌ను అక్టోబరు 2 నుంచి ప్రారంభిస్తున్నానంటూ నారాయణ జిందాల్‌ పేరుతో ఓ వ్యక్తి పోస్టు చేశారు. ఈ ప్లాన్‌లో చేరాలంటే కోటక్‌ ప్రో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడంతో పాటు వీఐపీ ట్రేడింగ్‌ ప్లాన్‌లో కూడా చేరితేనే లాభాలు వస్తాయని చెప్పాడు. ప్లాన్‌ను నమ్మి చేరాలని.. మిగతా గ్రూపు సభ్యుల పేరుతో.. లాభాలు వచ్చినట్లు గ్రూప్‌లో మెసేజ్‌లు చేసేవారు. ఇది నమ్మిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి యాప్ డౌన్‌‌లోడ్ చేసుకుని, కస్టమర్ కేర్ చెప్పినట్లు విన్నాడు. వాళ్ల మాయ మాటలు నమ్మిన ఆ ఉద్యోగి డబ్బులు కట్టాడు. 

ఇది కూడా చూడండి: Tirumala: దివ్వెల మాధురి మీద కేసు నమోదు

మొదటిగా రూ.5లక్షల పెట్టుబడి పెట్టడా 10 శాతం లాభం వచ్చినట్లు నేరగాళ్లు చూపించారు. అలా మొత్తం 90 లక్షలు పెట్టుబడి పెట్టాడు. కోట్ల విలువైన ఐపీవో షేర్లు ఇస్తు్న్నామని తెలిపి మొత్తం రూ.2.29 కోట్లు అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. ఈ డబ్బుకి రూ.1.10 కోట్లు లాభం వచ్చిందని, చెప్పి పదివేలు విత్‌డ్రా చేసుకునే వీలు కల్పించారు. మొత్తం సొమ్ము విత్‌డ్రా చేసుకోవాలంటే కొన్ని నిబంధనలు పాటించాలని తెలిపారు. కట్టిన రూ.2.29 కోట్లు, లాభం రూ.1.10 కోట్లు విత్‌ డ్రా చేయాలంటే మరో రూ.40 లక్షలు కట్టాలని చెప్పడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

ఇది కూడా చూడండి: అల్లు అర్జున్ పై సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం.. వైరల్ అవుతున్న వీడియో!

Advertisment
Advertisment
తాజా కథనాలు