అల్లు అర్జున్ పై సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం.. వైరల్ అవుతున్న వీడియో!

ఏపీ సీఎం చంద్రబాబు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడారు. 58 సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్ కు జాతీయ స్థాయిలో నేషనల్ అవార్డు వచ్చింది. ఇది గర్వించదగ్గ విషయమని బన్నీపై ప్రశంసలు కురిపించారు.

New Update
bunny

టాలీవుడ్ అగ్ర హీరో అల్లు అర్జున్.. 'పుష్ప' సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. తెలుగు చలన చిత్ర రంగంలో ఒక హీరోకి జాతీయ పురష్కారం దక్కడం అదే మొదటిసారి. సుమారు 60 ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది అగ్ర హీరోలకు దక్కని ఈ ఘనత అల్లు అర్జున్ కు దక్కడంతో దీన్ని ఇండస్ట్రీ మొత్తం సెలెబ్రేట్ చేసుకుంది. అటు రాజకీయ ప్రముఖులు సైతం బన్నీ పై ప్రశంశల వర్షం కురిపించారు.

ఇదిలా ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయిడు.. తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి గొప్పగా మాట్లాడుతూ అల్లు అర్జున్ ను పొగుడ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో చంద్రబాబు మాట్లాడుతూ..' ఈ రోజు తెలుగు సినిమా ప్రపంచ రంగంలో బ్రహ్మాండమైన పేరు తీసుకొచ్చింది. 

Also Read : 'విశ్వం' నుంచి మాస్ సాంగ్.. గోపీచంద్, కావ్య థాపర్ డ్యాన్స్ అదుర్స్

గర్విస్తున్నా..

దీనికి ఒక తెలుగు బిడ్డగా నేను గర్విస్తున్నా. 58 సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్ కు జాతీయ స్థాయిలో నేషనల్ అవార్డు వచ్చింది. ఇది గర్వించదగ్గ విషయం..' అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ వీడియోను బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. 

ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2' సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 'పుష్ప పార్ట్ - 1' కు సీక్వెల్ గా రాబోతున్న ఈ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. రష్మిక మందన, ఫహాద్ ఫాజిల్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం డిసెంబర్ 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు