Tirumala: దివ్వెల మాధురి మీద కేసు నమోదు

దివ్వెల మాధురి మీద తిరుమల వన్ టౌన్ లో కేసు నమోదు అయింది. మతవిశ్వాసాలు దెబ్బతీసే విధంగా ఆమె తిరుమల మాడవీధిలో రీల్స్ చేశారని ఆలయ విజిలెన్స్ అధికారి ఫిర్యాదు చేశారు. BNS 292,296, 300 సెక్షన్ 66 -2000-2008 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.

author-image
By Manogna alamuru
New Update
00

Case On Madhuri: 

దువ్వాడ,  మాధురి ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా మాధురి మీద తిరుమల వన్ టౌన్ లో కేసు నమోదు అయింది. మతవిశ్వాసాలు దెబ్బతీసే విధంగా ఆమె తిరుమల మాడవీధిలో రీల్స్ చేశారని ఆలయ విజిలెన్స్ అధికారి ఫిర్యాదు చేశారు. బ్రహ్మోత్సవాల‌ సమయంలో తిరుమల పవిత్రతను దెబ్బ తీసేలా ప్రవర్తించారని ఫిర్యాదులో తెలిపారు.  దీతంఓ మాధురి మీద.. BNS 292,296, 300 సెక్షన్ 66 -2000-2008 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. 

దువ్వాడ శ్రీనివాస్, వాణి, మాధురిల వివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో కలిసి జీవిస్తున్నాడనే అనుమానంతో దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, ఆమె బిడ్డలు ఇంటిముందు బైఠాయించారు.

ఈ విషయంపై నోరు విప్పిన దివ్వెల మాధురి తాను దువ్వాడ శ్రీనివాస్‌కి ఒక ఫ్రెండ్ మాత్రమేనని మీడియా ముందు తెలిపారు. అయితే మరోవైపు దువ్వాడ శ్రీను మాత్రం తాను తన భార్య వాణితో కలిసి జీవించడం లేదని.. మాధురితో జీవిస్తున్నానని తెలిపాడు. ఇలా శ్రీనివాస్, వాణి, మాధురిల వివాదం ప్రతి రోజూ పెరుగుతూ వచ్చింది. 

Also Read: పెళ్ళి చేసుకోలేదు.. ప్రపంచాన్ని గెలిచారు..వీళ్లు మాములోళ్లు కాదు బాసూ!

Advertisment
Advertisment
తాజా కథనాలు