హైదరాబాద్‌లోని నార్సింగిలో విషాద ఘటన చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి చెందిన శ్రీజ అనే యువతి రెండు రోజులు కిందట హైదర్‌షాకోట్‌లో ఉన్న అక్క ఇంటికి వెళ్లింది. కోఠి ఉమెన్స్ కాలేజీలో శ్రీజ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే వెంటనే ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: కంగువ ట్విట్టర్ రివ్యూ.. సూర్య బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టినట్లేనా!
ఇటీవల స్వాతిప్రియ అనే యువతి..
ఇదిలా ఉండగా బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ స్వాతిప్రియ ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే విద్యార్థిని స్వాతి ప్రియ మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెది ఆత్మహత్య కాదని ఎవరో చంపేసి సూసైడ్‌గా చిత్రీకరించారంటూ ఆరోపిస్తున్నారు. తమ కూతురి మృతదేహాన్ని చూపించకుండా మార్చురీకి తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: ఉత్కంఠంగా సాగిన మూడో టీ20..భారత్ విజయం
ఈ నేపథ్యంలో స్వాతిప్రియ సూసైడ్ కేసులో షాకింగ్ నిజాలు బయటకొస్తున్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించి RTV చేతిలో ఎక్స్‌క్లూజివ్ ఆధారాలు ఉన్నాయి!. వాటి ప్రకారం.. స్వాతి ప్రియ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం! అని తెలిసింది. వరుస కుదరని వ్యక్తితో స్వాతి ప్రియ ప్రేమలో పడిందని.. ఆ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెబితే వారు ఆ ప్రేమను అంగీకరించలేదని సమాచారం.
ఇది కూడా చూడండి: ఈరోజే మనకు బాలల దినోత్సవం..ఏఏ దేశాల్లో ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా?
దీని కారణంగానే స్వాతి ప్రియ కొంతకాలంగా తల్లిదండ్రులతో మాట్లాడలేదని తెలుస్తోంది. ఇందులో భాగంగానే సూసైడ్‌కు ముందు రెండు రోజులుగా స్వాతిప్రియ ఏడుస్తూనే ఉన్నట్లు సమాచారం. ప్రేమకు అంగీకరించలేదన్న కారణంతోనే స్వాతిప్రియ సూసైడ్! చేసుకుందని తెలిసింది. అయితే స్వాతిప్రియ ఫోన్‌లో సున్నితమైన అంశాలుండటంతో పోలీసులు అందులోని విషయాలు బహిర్గతం చేయలేదని తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Booker Prize: బుకర్‌ప్రైజ్ విజేతగా మొదటిసారి ఓ మహిళ