బిజినెస్ పేరుతో రూ.229 కోట్ల భారీ మోసం.. వేల సంఖ్యలో బాధితులు

డీకేజెడ్ టెక్నాలజీస్, డికాజో సొల్యూషన్స్ పేరుతో ఎండీ సయ్యద్‌ అష్ఫఖ్‌ రాహిల్, అతని భార్య డైరెక్టర్‌ సయీదా అయేషా ప్రజలను మోసం చేసి రూ.229 కోట్లు కాజేశారు. పెట్టుబడి పెడితే రూ.లక్షకి లక్ష లాభం ఇస్తామని ఆశ చూపించి మోసం చేశారు.

FotoJet (15)
New Update

వ్యాపారంలో చేరితే వాటా ఇస్తామని హైదరాబాద్‌లో భారీ మోసం జరిగింది. డీకేజెడ్ టెక్నాలజీస్, డికాజో సొల్యూషన్స్ పేరుతో ఎండీ సయ్యద్‌ అష్ఫఖ్‌ రాహిల్, అతని భార్య డైరెక్టర్‌ సయీదా అయేషా ప్రజలను మోసం చేసి రూ.229 కోట్లు కాజేశారు. తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే లాభాలు ఇస్తామని ఆశ చూపారు. 

ఇది కూడా చూడండి: ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మందికి తీవ్ర గాయాలు

హెడ్‌ఫోన్స్ డెలివరీ చేస్తున్నామని..

చాదర్‌ఘాట్, టోలిచౌకీలో అమెజాన్‌ భాగస్వామ్యంతో కొన్ని స్టోర్లు ఏర్పాటు చేశామని నమ్మించారు. డైలీ 4 వేల హెడ్‌ఫోన్లు, బ్యాండ్స్‌ డెలివరీ చేస్తున్నామని నమ్మించడంతో అందరూ పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేశారు. ఇలా మొత్తం 17500 మంది పెట్టుబడులు పెట్టారు. గుడిమల్కాపూర్‌కు చెందిన డాక్టర్‌ అబ్దుల్‌ జైష్‌ రూ.2.74 కోట్లు పెట్టుబడి పెట్టారు.

ఇది కూడా చూడండి: ఐపీవో షేర్లు ఇస్తామంటూ.. సైబర్ నేరగాళ్లు ఏం చేశారంటే?

దీంతో కొన్నాళ్లకు మోసపోయానని గ్రహించి హైదరాబాద్‌ సీసీఎస్‌లో ఫిర్యాదు చేయగా.. కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించారు. ఈ క్రమంలో ఎండీ సయ్యద్‌ అష్ఫఖ్‌ రాహిల్, అతడి భార్య డైరెక్టర్‌ సయీదా అయేషాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి బ్యాంక్ చెక్‌బుక్‌లు, 13 ల్యాప్‌టాప్‌లు, రూ.1.7 కోట్లు పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. 

ఇది కూడా చూడండి: ఏపీకి బిగ్ అలర్ట్.. ఈ నెల 14 నుంచి..

#crime
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe