ఏపీకి బిగ్ అలర్ట్.. ఈ నెల 14 నుంచి.. AP: రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలను అప్రమత్తం చేయాలని ప్రభుత్వానికి సూచించింది. కాగా ఇటీవల వర్షాల కారణంగా ఏపీలోని పలు గ్రామాలు నీటమునిగిన సంగతి తెలిసిందే. By V.J Reddy 11 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి AP Rains: ఏపీకి తుపాన్ల ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. అరేబియా సముద్రంలో ఒకటి... బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈనెల 13 నుంచి 15 మధ్య వాయుగుండంగా మారే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేసింది వాతావరం శాఖ. తీవ్ర వాయుగుండంగా బలపడి ఈ నెల 17 నాటికి ఏపీలోనే తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్య తీరాన్ని తాకే ఛాన్స్ ఉంది. ఏపీలో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఏపీలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. గత నెలలో వచ్చిన తుపాన్ నుంచి ఏపీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. విజయవాడను బుడమేరు ప్రవాహం ముంచేసింది. మళ్లీ తుపాన్లు వస్తే పరిస్థితి ఏంటని జనం భయపడుతున్నారు. #ap-rains మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి