AP Crime : కుప్పంలో దారుణం.. భార్యను అతికిరాతకంగా నరికాడు

చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం జరిగింది. బైరప్పకొట్టాలో భార్యను అతికిరాతకంగా నరికాడో భర్త.  రెండేళ్ల క్రితం తమిళనాడుకు చెందిన రాజేష్‌తో కీర్తనకు వివాహం జరిగింది. ప్రసవం కోసం పుట్టింటికి వచ్చి మగబిడ్డకు జన్మనిచ్చింది

New Update
kuppam

చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం జరిగింది. బైరప్పకొట్టాలో భార్యను అతికిరాతకంగా నరికాడో భర్త.  రెండేళ్ల క్రితం తమిళనాడుకు చెందిన రాజేష్‌తో కీర్తనకు వివాహం జరిగింది. ప్రసవం కోసం పుట్టింటికి వచ్చి మగబిడ్డకు జన్మనిచ్చింది కీర్తన.  అయితే పుట్టింట్లోనే కీర్తనపై కత్తితో దాడిచేశాడు భర్త రాజేష్.  కీర్తన కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడారు.  అనంతరం ఇంటి పైనుంచి దూకి బలన్మరణానికి ప్రయత్నించాడు రాజేష్.  రాజేష్‌ను పట్టుకొని స్థానికులు పోలీసులకు అప్పజెప్పారు. కీర్తన పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం పిఎస్ ఆస్పత్రికి తరలించారు. 

 భయంకరమైన రోడ్డు ప్రమాదం: వీడియో

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దల పండగ సందర్భంగా పొట్టేళ్లను తీసుకొని వెళ్తున్న ప్యాసింజర్ ఆటో నాసనాల్లి సమీపంలో రన్నింగ్‌లోనే బోల్తా పడింది. ఈ క్రమంలోనే అటువైపునుంచి వస్తున్న లారీ ఆటోపైనుంచి దూసుకెళ్లింది. ఆటో డ్రైవర్ రాజు(38), వ్యాపారి రవి(35) అక్కడికక్కడే మృతి సరోజకు తీవ్రగాయాలయ్యాయి.

https://x.com/TeluguScribe/status/1968528778864509200

Advertisment
తాజా కథనాలు