ముదిరిన వివాదం.. అత్త చెవిని కొరికేసిన కోడలు

కుటుంబ కలహాల కారణంగా అత్త చెవిని కోడలు కొరికేసిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. తుళ్లూరులో ఉంటున్న అత్త నాగమణికి, కోడలు పావనికి గత కొన్ని రోజులు నుంచి గొడవలు జరుగుతున్నాయి. తాజాగా గొడవ ముదరడంతో కోడలు ఏకంగా అత్త చెవిని కొరికేసింది.

New Update
Ear

అత్తాకోడళ్ల మధ్య గొడవలు సర్వసాధారణం. చిన్నగా మొదలైన గొడవలను అత్తాకోడళ్లు పెద్దవి చేసుకుంటారు. ఇదిలా ఉండగా.. ఓ కోడలు అత్తతో గొడవ పడుతూ ఏకంగా చెవినే కొరికేసిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తుళ్లూరు గ్రామంలో కంభంపాటి శేషగిరి, పావని అనే దంపతులు ఉన్నారు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి కోడలు పావనికి, అత్త నాగమణికి మద్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

ఇది కూడా చూడండి: BIG TWIST: హస్తానికి హ్యాండ్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్

కుటుంబ కలహాల కారణంగా..

కుటుంబ కలహాల కారణంగా అత్తాకోడళ్ల మధ్య గొడవ జరిగింది. గొడవ కాస్త పెరగడంతో కోడలు అత్త చెవిని కొరికేయగా.. మొత్తం భాగం ఊడిపోయింది. స్థానికుల సహాయంతో నాగమణిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆలస్యంగా తీసుకురావడం వల్ల తెగిన అతుక్కోవడం కష్టమని వైద్యులు తెలిపారు. దీంతో పోలీసులు వెంటనే కోడలిపై ఫిర్యాదు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని వెల్లడించినట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి:  BREAKING:వెనుకంజలో రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు