/rtv/media/media_files/2025/10/24/wife-2025-10-24-06-46-34.jpg)
గుజరాత్‌లో సంచలనం సృష్టించిన భార్య హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంతో నిందితుడు తన భార్యను దారుణంగా గొంతు కోసి హత్య చేసినట్లు తేలింది. ఈ హత్య తరువాత సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి అతనికి స్నేహితుడు సహాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన సర్దార్‌పూర్ గ్రామంలో జరిగింది, గ్రామ శివార్లలో కూలీలుగా పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక జంట ఈ ఘటనకు పాల్పడ్డారు. నిందితుడిని నానియా సాస్తేగా పోలీసులు గుర్తించారు. వేరే మహిళతో ఉన్న సంబంధంపై అతనిభార్య నియాతితో తరచుగా గొడవలు జరిగేవని, తన భార్యను వదిలి తన ప్రేమికురాలితో ఉండాలని నిర్ణయించుకుని భార్యను హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చారు.
అక్టోబర్ 18న రాత్రి 8 గంటల ప్రాంతంలో భార్య భర్తల మధ్య గొడవ జరగగా.. గొంతు కోసి చంపాడని విచారణలో పోలీసులు తేల్చారు. హత్య తర్వాత, నేరానికి సంబంధించిన ఆధారాలను తప్పించడానికి నానియా సాస్తే తన స్నేహితుడు జెను సోలంకి సహాయం కోరినట్లుగా పోలీసులు విచారణలో తేల్చారు. మధ్యప్రదేశ్‌లో నేర చరిత్ర ఉన్న సోలంకిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని కోర్టు ముందు హాజరుపరిచారు. పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి
మరోవైపు అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి చంపేసింది ఓ ఇల్లాలు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసరలో చోటుచేసుకోగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించిన వివరాలు ప్రకారం.. కీసర ప్రాంతానికి చెందిన నవనీతకు ఆమె మేన బావ నరేష్‌తో 2012లో పెళ్లి అయింది. ఇద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవించేవారు. అయితే కొంత కాలం క్రితం ఆంజనేయులు అనే మరో వ్యక్తి వద్దకు కూలీ పనులకు వెళ్లారు. అక్కడ ఆంజనేయులుకు, నవనీతకు మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది.
కొద్ది రోజులుగా వీరిద్దరి వ్యవహారంపై అనుమానం వచ్చిన నరేష్ తన భార్య నవనీతను టార్చర్ మొదలు పెట్టాడు. దీంతో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపేయాలని ప్రియుడు అంజనేయులుతో కలిసి నవనీత స్కెచ్ వేసింది. ఈ నెల15వ తేదీన దైవదర్శనం కోసం అని చెప్పి నరేష్‌ను ఒప్పించి ప్రియుడు అంజనేయులుతో కలిసి బైక్‌పై పెద్దగుట్ట వెళ్లింది నవనీత. దర్శనం తరువాత తిరుగు ప్రయాణంలో గాంధారి సమీపంలో ఆగి అక్కడ ఫుల్ మద్యం సేవించారు. నరేష్‌కు అతిగా మద్యం తాగించి పడిపోయాక ఆపై తీవ్రంగా కొట్టి హత్య చేశారు.ఎవరూ గుర్తు పట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చివేశారు. గాంధారి శివారు లోని చద్మల్ వెళ్లే దారిలో రోడ్డు పక్కన ఉన్న ఓ కాలువలో మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Also Read : Mass Jathara: సూపర్ డూపర్ హిట్ సాంగ్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న 'మాస్ జాతర' పాట ! ఇన్ని మిలియన్ వ్యూసా!
Follow Us