Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బరేలీ-హరిద్వార్ నేషనల్ హైవేపై వేగంగా వస్తున్న SUV కారు, ప్యాసింజర్లతో వస్తున్న టెంపోను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

New Update
crashed into a tempo

car hits tempo

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బరేలీ-హరిద్వార్ నేషనల్ హైవేపై వేగంగా వస్తున్న SUV కారు, ప్యాసింజర్లతో వస్తున్న టెంపోను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పిలిభిత్ నగరంలో అమరియా తహసీల్ ప్రధాన కార్యాలయం వైపు వెళ్తున్న టెంపోలో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. వేగంగా వస్తున్న ఎస్‌యూవీ కారు టెంపోను బలంగా ఢీకొట్టడంతో టెంపో అదుపుతప్పి పల్టీలు కొట్టి రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి పడిపోయింది. ప్రమాదం జరిగిన తీరు చూస్తే కారు డ్రైవర్ రాంగ్ రూట్‌లో వచ్చాడని తెలుస్తోంది.

ఈ ఘటనలో టెంపో పూర్తిగా నుజ్జునుజ్జయింది. SUV ముందు భాగం కూడా తీవ్రంగా దెబ్బతింది. ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను దలాల్‌గంజ్ గ్రామానికి చెందిన విజయ్ (30), నౌగ్వాన్ పారరియా పట్టణానికి చెందిన రజిదా బేగం (40), ఆమె కుమారుడు హంజా (3), జనేసర్ (10), పశ్చిమ బెంగాల్‌లోని మదన్‌పూర్‌కు చెందిన ఫరీదాగా పోలీసులు గుర్తించారు. ఫరీదా చికిత్స పొందుతూ మరణించగా, మిగతా నలుగురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఫైజల్ అనే 17 ఏళ్ల యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో బరేలీకి తరలించారు. SUV  కారులో ఉన్న నలుగురు వ్యక్తులు ప్రమాదం జరిగిన వెంటనే వాహనాన్ని వదిలి పరారయ్యారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని, పరారైన వారి కోసం గాలిస్తున్నారు. జిల్లా కలెక్టర్ జ్ఞానేంద్ర సింగ్, ఎస్పీ అభిషేక్ యాదవ్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అలోక్ కుమార్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి, వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు