మాజీ DGPకి కోడలితో అఫైర్.. కొడుకు అనుమానస్పద మృతి కేసులో బిగ్ ట్విస్ట్

పంజాబ్ రాష్ట్ర మాజీ DGP మహమ్మద్ ముస్తాఫా, ఆయన భార్య, మాజీ మంత్రి రజియా సుల్తానాపై వారి కుమారుడు అఖిల్ అఖ్తర్ అనుమానాస్పద మృతి కేసులో హర్యానా పోలీసులు హత్య, నేరపూరిత కుట్ర అభియోగాలపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

author-image
By K Mohan
New Update
EX DGP FIR

పంజాబ్ మాజీ DGP మహమ్మద్ ముస్తాఫా, ఆయన భార్య రజియా సుల్తానా (మాజీ మంత్రి)పై వారి కుమారుడు అఖిల్ అఖ్తర్ అనుమానాస్పద మృతి కేసులో హర్యానా పోలీసులు హత్య, నేరపూరిత కుట్ర అభియోగాలపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గత వారం పంజ్‌కులాలోని తన నివాసంలో అఖిల్ అఖ్తర్ (33) మరణించారు. మొదట ఇది డ్రగ్స్ ఓవర్ డోస్ లేదా అనారోగ్య సమస్యల కారణంగా జరిగిందనుకున్నారు. అయితే, మరణానికి ముందు అఖిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని వీడియోలు, అందులో ఆయన చేసిన సంచలన ఆరోపణలు ఈ కేసును కీలక మలుపు తిప్పాయి.

అఖిల్ అఖ్తర్ తాను మరణించడానికి ముందు రికార్డు చేసిన ఒక వీడియోలో, తన కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అతని తండ్రి (మాజీ డీజీపీ)కి, తన భార్యకు మధ్య అక్రమ సంబంధం ఉందని అఖిల్ వీడియోలో చెప్పాడు. ఈ కుట్రలో తన తల్లి (మాజీ మంత్రి), సోదరి కూడా భాగస్వాములేనని, తనను తప్పుడు కేసుల్లో ఇరికించడానికో లేదా చంపేయడానికో ప్రయత్నిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ వీడియో రికార్డ్ చేశాడు. వారు తనను పిచ్చోడిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని కూడా ఆ వీడియోలో అఖిల్ పేర్కొన్నట్లు తెలుస్తోంది.

అఖిల్ స్నేహితుడు, మలేర్‌కోట్ల వాసి అయిన షంషుద్దీన్ చౌదరి ఫిర్యాదు మేరకు హర్యానా పోలీసులు అక్టోబర్ 20న మాజీ డీజీపీ మహమ్మద్ ముస్తాఫా, రజియా సుల్తానా, అఖిల్ భార్య, సోదరితో సహా నలుగురిపై ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు కోసం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) స్థాయి అధికారి పర్యవేక్షణలో SIT ఏర్పాటు చేసినట్లు పంజ్‌కులా డీసీపీ సృష్టి గుప్తా తెలిపారు. మృతుడి సోషల్ మీడియా పోస్టులను, ఇతర ఆధారాలను పరిశీలించి నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు