ఎంత పని చేశావు ఎర్రిస్వామి? హైదరాబాద్ నుంచి వచ్చి.. వీడిన బస్సు ప్రమాదం మిస్టరీ!

కర్నూలు బస్సు ప్రమాదంలో బైక్ నడిపిన శివ శంకర్‌తోపాటు బైక్‌పై ఉన్న ఎర్రి స్వామిని పోలీసులు విచారించారు. శివ శంకర్ ఫ్రెండ్ ఎర్రిస్వామి శుక్రవారం రాత్రి జరిగిన విషయాలన్నీ కళ్లకు కట్టినట్లు పోలీసులకు చెప్పాడు. ప్రమాదానికి అసలు కారణం తెలిసింది.

New Update
shivashankar

కర్నూలు జిల్లాలో కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదంలో 20 మంది చనిపోయిన విషయం తెలిసిందే. బైక్ బస్సు ముందు భాగంలో చిక్కుకొని బస్సులో మంటలు వ్యాపించాయి. బైక్ నడిపిన శివ శంకర్‌తోపాటు బైక్‌పై ఉన్న అతని ఫ్రెండ్ ఎర్రి స్వామిని పోలీసులు విచారించారు. శివ శంకర్ ఫ్రెండ్ ఎర్రిస్వామి అలియాస్ టోనీ శుక్రవారం తెల్లవారుజామున 3గంటలకు జరిగిన విషయాలన్నీ కళ్లకు కట్టినట్లు పోలీసులకు చెప్పాడు. దీంతో బస్సులో అగ్నిప్రమాదానికి అసలు కారణం తెలిసింది. అసలు ప్రమాదం ఎలా జరిగిందో లైవ్‌లో చూసిన ఒకేఒక్క వ్యక్తి ఎర్రిస్వామి.. ఆ రోజు రాత్రి జరిగిన సంఘటనలు వరుసగా ఇలా ఉన్నాయి..

ఎర్రి స్వామి హైదరాబాద్ నుండి రాగానే శివశంకర్‌కు ఫోన్ చేసి కర్నూలు బస్టాండ్‌కు పిలిపించుకున్నాడు. 
బస్టాండ్‌లో ఉన్న ఎర్రిస్వామిని రిసీవ్ చేసుకున్న శివశంకర్ 
శివశంకర్, ఎర్రి స్వామి ఇద్దరు కలిసి చౌరస్తా ప్రాంతంలో మద్యం సేవించారు.
శివశంకర్ బైక్‌పై లక్ష్మీపురంలో ఉన్న ఎర్రి స్వామి ఇంటికి చేరుకొని
పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం రాంపురం గ్రామంలో వివాహానికి వెళ్లాలని తెల్లవారుజామున కర్నూల్ కొత్త బస్టాండ్‌లో డ్రాప్ చేయమని శివశంకర్‌ని ఎర్రిస్వామి కోరాడు. 
ఎర్రిస్వామిని తెల్లవారుజామున లేపి బస్టాండ్‌కి తీసుకెళ్తుండగా..
ఇద్దరు కలిసి లక్ష్మీపురం నుండి బైక్ పై బయలుదేరి నేషనల్ హైవే వద్దకు చేరుకోగానే డోన్ వరకు డ్రాప్ చేస్తానన్న శివశంకర్ 
బైక్‌పై డోన్‌కు వెళ్తుండగా చిన్నటేకూరు వద్ద  డివైడర్‌ని ఢీకొని కింద పడ్డ శివశంకర్, ఎర్రిస్వామి 
ఎర్రి స్వామికి స్వల్ప గాయాలు కావడంతో రోడ్డుపై పడి ఉన్న శివశంకర్‌ను పరిశీలించి చనిపోయాడని గుర్తించాడు 
నడిరోడ్డుపై పడి ఉన్న శివశంకర్‌ను రోడ్డు పక్కకు లాగేసిన ఎర్రి స్వామి 
రోడ్డుపై ఉన్న బైకుని సైడ్‌కి లాగే ప్రయత్నం చేసిన ఎర్రిస్వామి 
బండిని లాగుతున్న మరో ఆర్టీసీ బస్సు డ్రైవర్ అది చూసి ఎడమ పక్కకు వెళ్లిపోవడంతో తప్పిన ప్రమాదం 
ఆర్టీసీ బస్సు వెళ్లిన వెంటనే మళ్లీ బైకుని లాగుతున్న తరుణంలో వేగంగా వస్తున్న కావేరి ట్రావెల్ బస్సుని గమనించి పక్కకు పారిపోయిన ఎర్రిస్వామి 
బైక్‌పై నుండి బస్సు దూసుకుపోవడంతో కొంత దూరం వెళ్ళి ఆగిపోయిన కావేరి ట్రావెల్ బస్సు 
బస్సు కింద ఇరుక్కుపోయిన బైకును తీయడానికి ప్రయత్నించిన కావేరి బస్సు డ్రైవర్లు
కొద్దిసేపటికి బస్సు క్రింద నుండి మంటలు రావడంతో అక్కడి నుండి దూరంగా వెళ్లిపోయిన ఎర్రిస్వామి
బస్సు పూర్తిగా కాలిపోతున్న దృశ్యాలను అక్కడే ఉండి గమనించిన ఎర్రి స్వామి 
ప్రమాద దృశ్యాలను చూసి భయపడ్డ ఎర్రి స్వామి రోడ్డు ప్రక్కన పడి ఉన్న శివశంకర్ మృతదేహం వద్దకు వెళ్లి అతని వద్ద ఉన్న సెల్ ఫోన్ తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోయాడు
తనకేమీ తెలియదు అన్నట్టు సంఘటన ప్రాంతం నుండి లారీలో డోన్‌కు చేరుకున్న ఎర్రిస్వామి 
డోన్ నుండి ఆటోలో ప్యాపిలికి  చేరుకున్న ఎర్రిస్వామి 
ప్యాపిలి నుండి అడ్డదారి గుండా వెళ్తున్న ఆటోలో తుగ్గలి మండలం రాంపల్లి గ్రామానికి చేరుకున్న ఎర్రిస్వామి 
ప్రమాదంలో స్వల్ప గాయాలు ఉన్నప్పటికీ వైద్యం చేయించుకుంటే రోడ్డు ప్రమాదం కేసులో దొరికిపోతానని వైద్యం చేయించుకొని ఎర్రిస్వామి
పెట్రోల్ బంకులో శివశంకర్ తోపాటు ఎర్రి స్వామి ఉన్న సీసీటీవీలో రికార్డ్ అవ్వడంతోనే కేసును చేదించిన పోలీసులు 
తుగ్గలి మండలం రాంపురం గ్రామానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిఎస్పి రామయ్య, సిఐ మధు చేరుకొని ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకున్నారు
స్వల్ప గాయాలు ఉన్న ఎర్రి స్వామికి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందించి కర్నూలుకు తరలించి పోలీసులు విచారిస్తున్నారు..

Advertisment
తాజా కథనాలు