పోస్టాఫీసుల ద్వారా డ్రగ్స్‌ రవాణా.. రూ.21.17 కోట్ల సరుకు స్వాధీనం!

పోస్టాఫీసుల ద్వారా డ్రగ్స్ రవాణా చేస్తున్న ముఠాను బెంగళూర్ పోలీసులు పట్టుకున్నారు. ఇ-సిగరెట్లు, క్రిస్టల్స్, నూనె రూపాల్లో తరలిస్తున్న రూ.21.17 కోట్ల సరుకు స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు కమిషనర్‌ బి.దయానంద్‌ తెలిపారు. 

author-image
By srinivas
dedrere
New Update

ప్రభుత్వాలు, పోలీసులు ఎంత కట్టడి చేసినా డ్రగ్స్ రవాణా ఆగట్లేదు. మత్తపదార్థాలను అక్రమ రవాణా చేస్తున్న కేటుగాళ్లను పట్టుకుని ఎంత కఠినంగా శిక్షించిన ప్రయోజనం లేకుండా పోతుంది. వివిధ రూపాల్లో గంజాయి, డ్రగ్స్ సరాఫరా చేస్తూనే ఉన్నారు. పోలీసుల కళ్లుగప్పి గుట్టు చప్పుడు కాకుండా నగరాలు దాటిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా బెంగళూర్ లో ఏకంగా పోస్టాఫీస్ ద్వారా డ్రగ్స్ రవాణా చేసిన కేసు సచంలనం రేపుతుండగా వివరాలు ఇలా ఉన్నాయి.

ఇది కూడా చదవండి:  సైబర్ స్కామ్.. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో మహిళ బట్టలు విప్పించి..!

ఇ-సిగరెట్లు, క్రిస్టల్స్, నూనె రూపాల్లో

ఈ మేరకు శుక్రవారం బెంగళూరు క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ అధికారులు పోస్టాఫీసుల్లో సోదాలు నిర్వహించారు. దీంతో పలు పోస్టాఫీసుల్లో నిషేధిత పదార్థాలు ఇ-సిగరెట్లు, క్రిస్టల్స్, నూనె రూపాల్లోనూ ఉన్నట్లు గుర్తించి పకడ్బందీగా సోదాలు చేశారు. ఈ క్రమంలోనే రూ.21.17 కోట్ల మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ డ్రగ్స్‌ పార్సిళ్లు తెప్పించుకున్న ముగ్గురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ సరుకు మొత్తం అమెరికా, బ్రిటన్, బెల్జియం, థాయిలాండ్, నెదర్లాండ్‌ దేశాలకు చెందినదిగా నగర పోలీసు కమిషనర్‌ బి.దయానంద్‌ తెలిపారు. 

ఇది కూడా చదవండి: TN: హిందీని రుద్దకండి..మళ్ళీ రాజుకున్న వివాదం..మోదీకి స్టాలిన్ లేఖ

3,500 పార్సిళ్లు లభ్యం..

మొదట అనుమానం వచ్చిన పోస్టాఫీసుల్లో డాగ్‌ స్క్వాడ్‌ సాయంతో తనిఖీలు చేపట్టాం. దీంతో 3,500 పార్సిళ్లు దొరికాయి. వాటిలో 606కు పైగా మాదకద్రవ్యాల ప్యాకెట్లు ఉన్నాయి. నిషేధిత పదార్థాలు ఇ-సిగరెట్లు, క్రిస్టల్స్, నూనె రూపాల్లోనూ ఉన్నాయి. విదేశాల నుంచి అక్రమ మార్గంలో మాదక ద్రవ్యాలను తపాలా శాఖ పార్సిల్‌ సేవల ద్వారా బెంగళూరుకు తరలించారు. పార్సిళ్లపై అడ్రస్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని కమీషనర్ దయానంద్ మీడియాకు వెల్లడించారు. 

ఇది కూడా చదవండి:   సిన్వర్‌ చనిపోయే ముందు డ్రోన్ ఫొటేజ్.. వైరల్ అవుతున్న వీడియో

ఇది కూడా చదవండి:  వివాదంలో ఇరక్కున్న సీఎం కుమారుడు.. ఏం చేశాడంటే ?

#drugs #bengalore #post-office
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe