Crime:పశ్చిమ బెంగాల్‌లో దారుణం..వైద్యం కోసం వచ్చిన మహిళపై అత్యాచారం

ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు మానాలు పోగొడుతున్నారు. తమ ఆనందాల కోసం వైద్యవృత్తిని ఆడుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లో వైద్యం కోసం మహిళకు ట్రాంక్విటైజింగ్ సీరమ్ ఇంజెక్షన్ ఇచ్చి మరీ రేప్ చేశాడు ఓ ప్రబుద్ధ డాక్టర్. వివరాల్లోకి వెళితే..

author-image
By Manogna alamuru
girl raped
New Update

Doctor Raped his Patient: 

పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల జిల్లాలోని హస్నాబాద్‌లో తనకు ఒంట్లో బాలేదు అంటూ ఒక మహిళ డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. ఆమెను పరీక్షించిన తర్వాత డాక్టర్ యాంగ్జైటీ, టెన్షన్ పరిస్థితుల్లో మాససిక ప్రశాంతత కోసం ఇచ్చే ట్రాంక్విటైజింగ్ సీరమ్ ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారానిక ఒడిగట్టాడు. ఇంజక్షన్ ద్వారా ఆమె పూర్తిగా ప్రశాంతంగా ఉన్న సమయంలో రేప్ చేశాడు. ఆ తర్వాత ఆమె అభ్యంతరకరమైన రీతిలో ఫోటోలు తీశాడు. వాటిని వైరల్ చేస్తానని బెదిరించి తర్వాత కూడా చాలాసార్లు అత్యాచారం చేశాడు. 

Also Read: Stock Market: లాభాల్లో షేర్ మార్కెట్..రాణించిన బ్యాంకింగ్ షేర్లు

 

అక్కడితో ఆగిపోలేదు ఆ ప్రబుద్ధుడు..మహిళ దగ్గర నుంచి 4 లక్షల రూపాయలను కూడా వసూలు చేశాడు. మొదట్లో తన పరువు పోతుందని మహిళ ఎవరికి చెప్పలేదు. ఇదంతా జరుగుతున్న సమయంలో భర్త కూడా అందుబాటులో లేకపోవడంతో నిస్సహాయంగా ఉండిపోయింది. తర్వాత  భర్త సొంత ప్రాంతానికి తిరిగి వచ్చిన తర్వాత తనకు జరిగిన విషయాన్ని చెప్పింది. అప్పుడు ఇద్దరూ కలిసి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది.  బాధితురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. బాధితురాలి స్టేట్‌మెంట్‌ని పోలీసులు రికార్డ్ చేసుకుని, నిందితుడైన డాక్టర్‌ని ఐదురోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నారు.

Also Read: అత్యంత ఖరీదైన స్టాక్‌గా MRF...3రూ.ల నుంచి 2లక్షల36 వేలకు ఎదిగిన వైనం

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe