అత్యంత ఖరీదైన స్టాక్‌గా MRF...3రూ.ల నుంచి 2లక్షల36 వేలకు ఎదిగిన వైనం ఒకప్పుడు అది చాలా చిన్న స్టాక్. కేవలం 3 రూ.లు మాత్రమే దాని ఖరీదు. కానీ ఇప్పుడు దాని విలువ 2, 36,000రూ. అది కూడా అతి తక్కువ వ్యవధిలో కేవలం నాలుగు నెలల్లో ఈ స్టాక్ వాల్యూ ఇంతలా పెరగడం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. By Manogna alamuru 29 Oct 2024 | నవీకరించబడింది పై 29 Oct 2024 18:43 IST in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి MRF Stock: ఎమ్ఆర్ఎఫ్...భారతదేశంలో దీని గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. భారతదేశంలో ఉన్న టైర్ల కంపెనీల్లో ఇది టాప్ బ్రాండ్. కానీ స్టాక్ మార్కెట్ పరంగా చూస్తే చాలా చిన్నది. అయితే అది కూడా జూలై వరకు మాత్రమే. ఆ తర్వాత మాత్రం ఈ స్టాక్ వాల్యూ పెరిగిన తీరు ఆశ్చర్యపరచకమానదు. ఈ ఏడాది జూలైలో ఎమ్‌ఆర్‌ఎఫ్ స్టాక్ వాల్యూ రూ.3.21 మాత్రమ. కానీ నాలుగు నెలల తర్వాత ఆక్టోబర్ 2 అంటే ఈరోజు అదే స్టాక్ వాల్యూ 2, 36, 250 రూ. మొత్తం క్యాపిటలైజేషన్ 4, 800 కోట్లు. అత్యంత తక్కువ సమయంలో ఎమ్ర్ఎఫ్ దీనిని ఆధించగలిగింది. ఇప్పుడు దేశీ మార్కెట్‌లో ఇదో పెద్ద సంచలనం. బీఎస్‌ఈలో ఈమధ్యనే ప్రత్యేక కాల్ వేలం మెకానిజం ద్వారా హోల్డింగ్ కంపెనీల రేట్లను నిర్ణయించారు. దీన్ని మళ్ఈ ఈరోజు ప్రత్యేక నిబంధన తర్వాత స్టాక్స్ ప్రభావవంతమైన రేట్లు నిర్ణయించారు. వాటిలో ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఒకటి. ఇతర కంపెనీలలో నల్వా సన్స్ ఇన్వెస్ట్‌మెంట్స్, TVS హోల్డింగ్స్, కళ్యాణి ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ, SIL ఇన్వెస్ట్‌మెంట్స్, మహారాష్ట్ర స్కూటర్స్, GFL, హర్యానా క్యాఫిన్ మరియు పిలానీ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ వంటి పేర్లు ఉన్నాయి. ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రమోటర్లు స్వచ్ఛందంగా ఒక్కో షేరుకు రూ. 1,61,023 బేస్ ధరతో డీలిస్టింగ్ కోసం ఆఫర్ చేశారు. దీనికోసం ప్రత్యేక తీర్మానాన్ని ప్రతిపాదించారు. అయితే వీటికి అవసరమైన మెజారిటీ పబ్లిక్ షేర్‌హోల్డర్‌లు రాకపోవడంతో తీర్మానం విఫలమైంది. ఇక ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్స్, 2,00,000 షేర్ క్యాపిటల్‌తో, 2,83,13,860 ఈక్విటీ షేర్లను కలిగి ఉంది.దాంతో పాటూ ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్‌లో 2.95 శాతం వాటాను కలిగి ఉంది. ఇది మునుపటి ముగింపు నాటికి దాదాపు రూ. 8,500 కోట్లు. స్టాక్ మార్కెట్‌లలో ఎఆర్ఎఫ్ స్టాక్‌కు ఇంత గొప్ప ధర లభించడానికి ఇదే కారణం. ప్రస్తుతం ఎమ్‌ఆర్ఎఫ్ ఒక్కో షేరుకు రూ. 2.36 లక్షల దగ్గర ట్రేడ్ అవుతోంది. కానీ ఏషియన్ పెయింట్స్‌లో హోల్డింగ్‌ని బట్టి ఈ స్టాక్ ఇప్పటికీ దాదాపు 45 శాతం తగ్గింపుతో దాని అంతర్గత షేరు ధర విలువ మాత్రం రూ. 4.25 లక్షలతో ట్రేడవుతోంది.అయితే ఇలాంటి కంపెనీలుధరలు ఎంత పెరిగినా...రిస్క్ కూడా అంతే పెరుగుతుంది అని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. ఇందులో డబ్బులు పెట్టడం అనేది పూర్తిగా వ్యక్తుల రిస్క్ మీద ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. Also Read: Stock Market: లాభాల్లో షేర్ మార్కెట్..రాణించిన బ్యాంకింగ్ షేర్లు మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి