3,237 మంది డిజిటల్ అరెస్ట్.. రూ.237 కోట్లు లూటీ చేసిన కేటుగాళ్లు! దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. డిజిటల్ అరెస్టుల పేరుతో అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. ఈ 10 నెలల్లోనే డిజిటల్ అరెస్టుల పేరుతో 3,237 మందిని బెదిరించి రూ. 237 కోట్లు కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు. పలువురిని అరెస్ట్ చేశారు. By srinivas 04 Nov 2024 in క్రైం మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి Digital arrest: దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. డిజిటల్ అరెస్టుల పేరుతో కొత్త రకం దందాకు తెరతీసి అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోనూ ఆన్‌లైన్ ఇంటరాగేషన్, డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరింపులకు పాల్పడుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ మేరకు గడిచిన 10 నెలల్లోనే ఏకంగా 3,237 మంది బాధితులను డిజిటల్ అరెస్టుల పేరుతో బెదిరించి రూ. 237 కోట్ల వరకూ లూటీ చేశారు. 10 నెలల్లో రూ.237.11 కోట్లు దోపిడి.. సైబర్ చీటర్స్ ఢిల్లీ, ముంబై, యూపీ, కోల్‌కతా కేంద్రంగా వరుసగా నేరాలకు పాల్పడుతుండగా ఇటీవల హైదరాబాద్ కు చెందిన ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగిని (74) నుంచీ రూ. 37 లక్షలు దోచేశారు. క్రైమ్ బ్రాంచ్, సీబీఐ, ఈడీ, కస్టమ్స్ అధికారులమని చెప్పుకుంటూ బ్లాక్ మెయిల్ చేశారు. స్కైప్, వాట్సాప్ వీడియో కాల్స్ చేసి ఉక్కిరిబిక్కిరి చేసి.. డిజిటల్ అరెస్ట్, ఆన్‌లైన్ ఇంటరాగేషన్ పేరుతో 10 నెలల వ్యవధిలోనే 3,237 మంది బాధితుల నుంచి రూ.237.11 కోట్లు దోచేశారు. వీటికి సంబంధించి సైబర్ సెక్యూరిటీ బ్యూరోతో పాటు గ్రేటర్ లోని మూడు కమిషనరేట్ల సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీ, ముంబై, నోయిడా, గుర్‌గావ్, యూపీ, వెస్ట్ బెంగాల్‌కు చెందిన సైబర్ ముఠాలు ఎక్కువగా వరుస సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇది కూడా చదవండి: మీదంతా రిక్రూట్‌మెంట్ మాఫియా.. ఝార్ఖండ్‌లో మోదీ సంచలన ఆరోపణలు! నంద్యాల, మహబూబ్ నగర్ లో రూ.25 కోట్లు అలాగే నంద్యాల జిల్లా డోన్‌లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. క్రిప్టో కరెన్సీ పేరుతో రామాంజనేయులు అనే వ్యక్తి కర్నూలు నంద్యాల, మహబూబ్‌నగర్ జిల్లాలో 300 మందిని బురిడి కొట్టించాడు. రూ.లక్ష పెట్టుబడిపెడితే నెలకు రూ.10 వేలు ఇస్తామంటూ నమ్మించి రూ.25 కోట్లు వసూలు చేశాడు. 2021లో కేవ-ఇండస్ట్రీస్ ఆర్గానిక్ హెర్బల్ కంపెనీ పేరుతో ప్రజలను ఆంజనేయులు పరిచయం చేసుకున్నారు. నంద్యాలతో పాటు చుట్టు ప్రాంతాల్లో క్రిప్టో దందా నిర్వహించారు. మధ్యతరగతి కుటుంబాలు, వ్యాపారులు, యువత, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రియల్ వ్యాపారులను క్రిప్టో దందావైపు ఆకర్షించారు. అంతేకాదు కోట్లలో లావాదేవీలు జరుగుతున్నట్లు ఆంజనేయులు నమ్మించాడు. చివరగా రూ. 25 కోట్ల మేర వసూలు చేసి ఆంజనేయులు పరారయ్యారు. బాధితులు పోలీస్ స్టేషన్లో గోడు వెలబోసుకుంటున్నారు. గుజరాత్ నివాసి రూ. 21 కోట్ల దోపిడి..ఉత్తరాఖండ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) సైబర్ క్రైమ్ పోలీసులు.. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ నుండి దేశవ్యాప్తంగా 3,200 సైబర్ మోసాలకు పాల్పడిన మరో హవాలా ఆపరేటర్ సైబర్ మోసగాడిని అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా ఇతను రూ. 21 కోట్లకు పైగా దోచేసినట్లు ఎస్‌టిఎఫ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంకుష్ మిశ్రా తెలిపారు. గుజరాత్‌లోని సూరత్ నివాసి అయిన నిందితుడు యూసఫ్ మీర్జా ఖాన్ (46) సైబర్ నేరాలు, హవాలా కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నట్లు తెలిపారు. అతని ముఠాపై దేశవ్యాప్తంగా మొత్తం 159 క్రిమినల్ కేసులున్నాయని, 3,272 సైబర్ నేరాలతో సంబంధం కలిగి ఉన్నారని STF దర్యాప్తులో గుర్తించినట్లు మిశ్రా చెప్పారు. ఉత్తరాఖండ్ పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలు మరియు ఇంటెలిజెన్స్ ఆధారంగా మహాబలేశ్వర్ నుండి అతన్ని పట్టుకున్నారు. ఇది కూడా చదవండి: అవన్నీ పిరికి ప్రయత్నాలు.. మనల్ని బలహీనపరచలేవు: కెనడా ఇష్యూపై మోదీ! ఎలా బురిడి కొట్టిస్తారంటే.. డిజిటల్ అరెస్ట్‌లో భాగంగా ఆన్‌లైన్‌లో ఇంటరాగేషన్ చేస్తున్నట్లు నమ్మిస్తారు. స్కైప్ లేదా వాట్సాప్ వీడియో కాల్ చేస్తారు. పోలీస్ యూనిఫామ్‌తో కనిపించి ఆధార్, బ్యాంక్ డిటైల్స్ తీసుకుంటారు. వీటిని పరిశీలిస్తున్నట్టు నటించి ఓ రూమ్‌లో కూర్చుని ఇంటరాగేషన్ ఎదుర్కోవాలని సూచిస్తారు. ఎవరికైనా చెప్పినా, కాల్‌కట్ చేసినా.. వెంటనే అరెస్ట్ చేస్తామని బెదిరిస్తారు. మరోవైపు ఫేక్ అరెస్ట్ వారెంట్స్, ఆర్బీఐ, ఈడీ నోటీసులు వాట్సాప్‌కి పంపించి, దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ నేరాల్లో ఆధార్, ఫోన్ నంబర్స్ ఉన్నాయని బెదిరింపులకు పాల్పడతారు. కొద్దిసేపట్లో సిమ్ కార్డ్ డిస్ కనెక్ట్ అవుతుందని చెప్తారు. ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా డిజిటల్ అరెస్ట్ చేశామంటారు. ఉన్నతాధికారి మాట్లాడుతాడని మరొకరితో మాట్లాడిస్తారు. ఇలా గంటల కొద్ది వీడియో కాల్‌లోనే ఉంచుతారు. చివరికి డీల్ కుదుర్చుకుంటే కేసు నుంచి తప్పిస్తామని నమ్మించి బేజు గుల్ల చేస్తారు. #telangana #cyber-crime #digital arrest మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి