Dharmasthala case : ధర్మస్థలలో శవాల గుట్టలు.. దొరికిన 25 ఎముకలు ఎవరివి?

నేత్రావతి నదికి సమీపంలోని ఒక స్థలంలో 4 అడుగుల గుంతలో 25 మానవ ఎముకలు బయటపడ్డాయి. దీంతో ఈ కేసుకీలక మలుపు తిరిగింది. సిట్ నేతృత్వంలోని తవ్వకాల చేపట్టగా ఈ మానవ ఎముకలు  బయటపడ్డాయి.

New Update
dharmasthala

దేశవ్యాప్తంగా ప్రస్తుతం ధర్మస్థల కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రధానంగా ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణల నేపథ్యం చుట్టూ దర్యాప్తు జరుగుతోంది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నేత్రావతి నదికి సమీపంలోని ఒక స్థలంలో 4 అడుగుల గుంతలో 25 మానవ ఎముకలు బయటపడ్డాయి. దీంతో ఈ కేసుకీలక మలుపు తిరిగింది. సిట్ నేతృత్వంలోని తవ్వకాల చేపట్టగా ఈ మానవ ఎముకలు  బయటపడ్డాయి. 

DNA అనాలసిస్‌ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు

మొదట తవ్విన ప్రదేశాలలో ఎటువంటి అవశేషాలు లభించనప్పటికీ తాజాగా ఆరో సైట్‌లో జరిపిన తవ్వకాల్లో ఇవి బయటపడడం అందరిని షాక్ కు గురిచేసింది. ఈ ఎముకలను DNA అనాలసిస్‌ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు.  అయితే ఈ ఎముకలు 25 మందివా లేకా ఒక్కరివేనా అన్నది తెలియాల్సి ఉంది.  అయితే ఆరో ప్రదేశంలోనే 8 శవాలు పాతిపెట్టినట్లుగా మాజీ పారిశుధ్య కార్మికుడు చెబుతున్నాడు.  దీంతో  ఈ కేసులో టర్నింగ్ పాయింట్‌గా ఆరో సైట్‌ మారింది. అటు మిగతా ప్రదేశాల్లోనూ తవ్వకాలు కొనసాగుతున్నాయి.

Also read :  Bhupalapally: భూపాలపల్లి ఎమ్మెల్యేకు బిగ్ షాక్.. క్యాంపు ఆఫీసులోకి బర్రెలు

  1995 నుంచి 2014 మధ్య ధర్మస్థలంలో 100 కి పైగా మృతదేహాలను - ఎక్కువగా మహిళలు, మైనర్లను రహస్యంగా ఖననం చేయమని బలవంతం చేశారని  మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణల చేసిన మేరకు పోలీసులు కేసు బుక్ చేశారు. దీనిని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ సర్కార్ సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రణవ్ మహంతి నేతృత్వంలో  సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ బృందం జూలై 28న దర్యాప్తు ప్రారంభించింది. ఫిర్యాదుదారుడు గుర్తించిన 15 ప్రదేశాలలో మృతదేహాలు పూడ్చిపెట్టినట్లు ఆరోపించిన ప్రాంతాల్లో తవ్వకాలను ప్రారంభించింది. మొత్తంగా ఈ కేసు కర్ణాటకలో తీవ్ర చర్చకు దారితీసింది, దీని వెనుకున్న నిజానిజాలను బయటపడాలని ప్రజలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం  దర్యాప్తు వేగవతంగా కొనసాగుతోంది కాబట్టి రాబోయే రోజుల్లో దీనిపై మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.

ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేసేందుకు సీనియర్ అధికారులను కూడా ఎస్ఐటిలో చేర్చారు. ఈ బృందం మిగిలిన ఖనన ప్రదేశాలలోనూ తవ్వకాలు జరపనుంది. ప్రజల నుంచి సమాచారం సేకరించడానికి మంగళూరులో ఒక ప్రత్యేక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రజలు సమాచారం అందించడానికి హెల్ప్‌లైన్ నంబర్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ కేసు 2012లో జరిగిన సౌజన్య అత్యాచారం, హత్య కేసుతో ముడిపడి ఉంది. మాజీ పారిశుద్ధ్య కార్మికుడి ఆరోపణల నేపథ్యంలో ఈ కేసుపై మళ్లీ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. 

Also Read :  Dharmasthala Case: ధర్మస్థల ఆలయ చరిత్ర.. వెలుగులోకి ఆసక్తికర నిజాలు

Advertisment
తాజా కథనాలు