ఢిల్లీ బాంబ్ పేలుడు వెనక ఉగ్ర కుట్ర.. కీలక విషయాలు వెల్లడించిన ఎన్ఐఏ!

ఢిల్లీలోని రోహిణి సీఆర్పీఎఫ్ స్కూల్ దగ్గర జరిగిన బాంబ్ పేలుడుపై ఎన్ఐఏ కీలక విషయాలు బయటపెట్టింది. ఆ ప్రాంతం మొత్తం షాక్ వేవ్స్ కలిగేలా పేలుళ్లు జరిపినట్లు తెలిపింది. అయితే ఈ ఘటనలో ఉగ్రకుట్ర ఉందని ఎన్ఐఏ భావిస్తోంది.

author-image
By Kusuma
fdfdd
New Update

Delhi: ఢిల్లీలోని రోహిణి సీఆర్పీఎఫ్ స్కూల్ బయట జరిగిన బాంబ్ పేలుడుపై ఎన్ఐఏ కీలక అంశాలు బయటపెట్టింది. ఈ ఘటనపై వెంటనే  దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ.. ప్రాథమిక ఆధారాలతో పేలుడు జరిగిన ప్రాంతంలో తెల్లటి పౌడర్ ను గుర్తించింది. ఆ ప్రాంతం అంతా షాక్ వేవ్స్ కలిగేలా పేలుళ్లు జరిపినట్టు అనుమానిస్తున్న ఎన్ఐఏ..ఈ ఘటనలో ఉగ్రకుట్ర ఉందని భావిస్తోంది. భారీ పేలుడు కారణంగా స్కూల్ గోడ కూలిపోయిందని, కార్లు అద్దాలు పగిలిపోగా, దుకాణాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిపింది. మరిన్ని ఆధారాలను ఫోరెన్సిక్ బృందం సేకరిస్తోందని,  క్రైమ్, ఎఫ్‌ఎస్ఎల్ బృందాలు, బాంబు డిస్పోజల్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. 

ఇది కూడా చదవండి: Diwaliకి కొత్త రెవెన్యూ చట్టం.. ప్రభుత్వానికి చేరిన దస్త్రం

సీఆర్పీఎఫ్‌ పాఠశాల సమీపంలో..

ఈ మేరకు ఆదివారం ఉదయం 7:47 గంటలకు సీఆర్పీఎఫ్‌ పాఠశాల సమీపంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పాఠశాల గోడ కూలిపోయింది. కానీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. పేలుడు గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని చర్యలు చేపట్టింది.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌ నుంచి యాదాద్రికి త్వరలో ఎంఎంటీఎస్‌ సేవలు: కిషన్ రెడ్డి

ఈ బాధ్యత బీజేపీదే.. ఢిల్లీ సీఎం

ఇక ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ సీఎం అతిశీ.. ఎన్డీఏ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు. కానీ వారేమీ పెద్దగా పట్టించుకోవట్లేదంటూ మండిపడ్డారు. ‘ఈ రోజు చోటు చేసుకున్న పేలుడు ఘటన దేశ రాజధానిలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయనే విషయాన్ని స్పష్టం చేసింది. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్రం ప్రభుత్వానిదే. బీజేపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ప్రభుత్వం చేస్తున్న పనులకు అంతరాయం మాత్రం కలిగిస్తోంది. అండర్‌ వరల్డ్‌ ముంబైలా ఢిల్లీ పరిస్థితి మారుతోంది’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. 

ఇది కూడా చదవండి: Golf City: హైదరాబాద్‌కు త్వరలో 200 ఎకరాల్లో గోల్ఫ్ సిటీ..

ఇది కూడా చదవండి: ఆర్మీ జవాన్ గా హాస్టల్ వంటమనిషి.. మహిళతో స్నేహం చేసి ఏం చేశాడంటే!

#delhi #nia #bomb
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe