/rtv/media/media_files/2025/10/25/hyderabad-cp-sajjanar-2025-10-25-16-04-27.jpg)
డైనమిక్ IPS ఆఫీసర్, హైదరాబాద్ నూతన సీపీ సజ్జనార్‌కు షాక్.. సైబర్ నేరగాళ్లు ఏకంగా ఆయన ఫొటోనే వాట్సాప్ ప్రొఫైల్‌గా పెట్టుకొని పలువురికి మెస్సేజ్‌లు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇలాంటి మోసగాళ్లను నమ్మోద్దని సజ్జనార్ సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన పేరుతో మెస్సేజ్‌లు పంపిన ఫొటోని Xలో షేర్ చేశారు.
జాగ్రత్త! ముఖం చూసి మోసపోవద్దు
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 25, 2025
వాట్సాప్ లో డీపీగా నా ఫోటోను పెట్టుకుని తెలిసిన వాళ్లకు సందేశాలు పంపిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది.
ఇవి నకిలీ ఖాతాలు. పూర్తిగా మోసపూరితమైనవి.
ఇలాంటి సందేశాలకు స్పందించకండి. ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి.
సైబర్ నేరగాళ్లకు మీ… pic.twitter.com/AuvB7XzLXr
తరచూ ఇలాంటి వాటి పట్ల ఆయన ప్రజల్ని అప్రమత్తం చేస్తుంటారు. అలాంటిది సైబర్ క్రిమినల్స్ ఆయన ఫొటోనే వాడుతున్నారంటే దీన్ని ఆయన సీరియస్‌గా తీసుకుంటారనే చెప్పవచ్చు. ఇలాంటి ఫ్రాడ్స్‌పై ఆయన ఉక్కుపాదం మోపే అవకాశం ఉంది. ఆర్టీసీ నుంచి సీపీగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ఇలాంటి సైబర్ నేరగాళ్లపై ఆయన నేరుగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గతంలోనూ బెట్టింగ్ యాప్‌లు, సైబర్ నేరాలు వంటి వాటి వలలో పడవద్దని ఆయన కాపెయినింగ్ చేశారు. అలాంటిది కొందరు దుండగులు ఆయన పేరు, ఫేస్‌తోనే సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ దృష్టికి వచ్చింది. దీంతో ఆయన అందర్ని అలర్ట్ చేశారు. ఎక్స్‌లో స్క్రీన్ షార్ట్ షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు..
‘‘జాగ్రత్త! ముఖం చూసి మోసపోవద్దు వాట్సాప్‌లో డీపీగా నా ఫోటోను పెట్టుకుని తెలిసిన వాళ్లకు సందేశాలు పంపిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇవి నకిలీ ఖాతాలు. పూర్తిగా మోసపూరితమైనవి. ఇలాంటి సందేశాలకు స్పందించకండి. ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి. సైబర్ నేరగాళ్లకు మీ వ్యక్తిగత వివరాలను అసలే ఇవ్వొద్దు. డబ్బులు అడిగితే పంపించొద్దు. సైబర్ మోసగాళ్లకు మీ జాగ్రత్తే అడ్డుకట్టనే విషయం మరచిపోవద్దు. నకిలీ వాట్సాప్ ఖాతాలు మీ దృష్టికి వస్తే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు కాల్ చేసి సమాచారం ఇవ్వండి. అలాగే జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.’’ అని పేర్కొన్నారు.
Follow Us