TSRTC: మహిళల ఫ్రీ జర్నీకి ఆర్టీసీ కొత్త రూల్.. పాటించకపోతే రూ.500 ఫైన్!
ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ చేయడానికి మహిళలు ఆధార్/ఓటర్ ఐడీ కార్డు లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును వెంట తీసుకువచ్చి జీరో టికెట్ తీసుకోవాలని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ఈ రూల్ పాటించకుండా ఫ్రీ జర్నీ చేస్తే రూ.500 ఫైన్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు.