HYD: మణికొండలో పైప్‌లైన్‌ బ్లాస్ట్‌ కాలనీలను ముంచెత్తిన వరద

దరాబాద్‌లోని మణికొండలో నగరానికి తాగునీరు అందించే  భారీ పైప్‌లైన్‌ పగిలి కాలనీల్లోకి వరద వచ్చి చేరింది. సింగూరు నుంచి హైదరాబాద్‌కు తాగునీటిని తీసుకువచ్చే పైప్ లైన్ మంగళవారం తెల్లవారుజామున పగిలిపోయింది.

New Update
FotoJet (11)

Flood inundates pipeline blast colonies in Manikonda

HYD : హైదరాబాద్‌లోని మణికొండలో నగరానికి తాగునీరు అందించే  భారీ పైప్‌లైన్‌ పగిలి కాలనీల్లోకి వరద వచ్చి చేరింది. సింగూరు నుంచి హైదరాబాద్‌కు తాగునీటిని తీసుకువచ్చే పైప్ లైన్ మంగళవారం తెల్లవారుజామున పగిలిపోయింది. దీంతో అపార్ట్‌మెంట్‌ సెల్లార్లన్ని వరద నీటితో నిండిపోయాయి. సెల్లార్లలో ఉన్న వాహనాలు నీటిలో మునిగిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక, హైడ్రా సిబ్బంది, మున్సిపల్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో రోడ్డు మొత్తం ధ్వంసం అయి రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. NDRF బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు.
 
 మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ శబ్ధం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బయటకు వెళ్లి చూసేప్పటికి ప్రధాన నీటి సరఫరా మార్గమైన తాగునీ పైప్‌లైన్ పేలిపోయినట్లు గుర్తించారు. పైప్‌లైన్ పేలిన ధాటికి నీరు భారీ ఎత్తున ఎగసిపడి వరదలా రోడ్లపై ప్రవహిస్తూ సమీపంలోని ఇళ్లలోకి చేరింది. నీటి ఉధృతి కారణంగా సమీపంలోని రెండు అపార్ట్‌మెంట్ల సెల్లార్‌లు పూర్తిగా నీటితో నిండిపోయాయి.

సడన్‌గా జరగిన ఈ ఘటనలతో సెల్లార్‌లో  పార్క్‌ చేసి ఉన్న కార్లు, ద్విచక్ర వాహనాలు నీట మునిగిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే ఎన్‌డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సెల్లార్లలో నిండిన నీటిని భారీ మోటార్ల సహాయంతో బయటకు తోడేందుకు ప్రయత్నిస్తున్నారు. గత 2 గంటలుగా అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే అధికారులు అదేవిధంగా మంచి నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంతో అపార్ట్‌మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా నీటిపారుదల అధికారులు పైపులైన్‌ పనులను పునరుద్ధరించేందుకు యత్నిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు