/rtv/media/media_files/2025/09/17/money-2025-09-17-19-55-29.jpg)
Money
SBI: దేశంలో డిజిటల్ చెల్లింపులు ఎంత వేగంగా విస్తరిస్తున్నప్పటికీ నగదు చెల్లింపులు ఇంకా వినియోగంలోనే ఉన్నాయి. నగదు చెల్లింపులు పెరుగుతున్నప్పటికీ ప్రజల్లో నగదు వినియోగం కూడా అదే స్థాయిలో పెరుగుతుందని ఎస్‌బీఐ రీసెర్చ్ తాజా నివేదిక వెల్లడించింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీల సంఖ్య-విలువ పరంగా ఇప్పటికే ఘననీయమైన రికార్డులు సృష్టిస్తున్నాయి. అయినా 2026 జనవరి చివరికి చలామణిలో ఉన్న నగదు పరిమాణమూ జీవనకాల గరిష్ఠమైన రూ.40 లక్షల కోట్లకు చేరినట్లు ఎస్‌బీఐ రీసెర్చ్ తాజా నివేదిక వెల్లడించింది. అయితే అయిదేళ్ల వ్యవధిలో స్థూల దేశీయోత్పత్తితో పోలిస్తే, నగదు నిష్పత్తి 14.4% నుంచి 11 శాతానికి తగ్గందని, ఇది ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులను అద్దం పడుతోందని తెలిపింది.
కాగా కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఏటీఎంల నుంచి నగదు డ్రా చేయడం వంటివి పెరుగుతుంటే, ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా తగ్గుతోందని నివేదిక తెలిపింది. 2022-23లో ఏపీలో ఒక్కో ఏటీఎం నుంచి సగటున నెలకు రూ.1.57 కోట్లు విత్‌డ్రా అయ్యేవని అలాంటిది. 2025-26 డిసెంబరుకు ఇది రూ.1.34 కోట్లకు తగ్గిందని వెల్లడించింది. అంటే డిజిటల్ లావాదేవీలు అధికమయ్యాయని పేర్కొంది. సాధారణంగా డిజిటల్ చెల్లింపులు పెరిగాక, తక్కువ విలువైన నోట్ల వినియోగం కూడా తగ్గుతుంది. కానీ, తెలంగాణ, ఏపీలో రూ.100 నోట్ల వినియోగం పెరుగుతోంది. తమిళనాడులో రూ.200 నోట్ల వినియోగం అధికంగా ఉందని నివేదిక వెల్లడించింది.
కర్ణాటక వాణిజ్య పన్నుల శాఖ చిన్న వ్యాపారులు, విక్రేతలకు దాదాపు 18,000కు పైగా జీఎస్‌టీ నోటీసులు జారీ చేసింది. ఈ పరిణామం వ్యాపారులను డిజిటల్ చెల్లింపుల నుంచి నగదు వైపు మళ్లేలా చేసింది.
బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరగడం.. మార్కెట్లో నగదు లభ్యత పెరగడానికి ఒక కారణంగా సర్వే తెలిపింది.చాలా కుటుంబాలు తమ వద్ద ఉన్న పాత ఆభరణాలను విక్రయించి, నగదుగా మార్చుకుంటున్నారు.
రూ.500 నోట్లదే ఆధిపత్యం: ‘యూపీఐ ప్రధానంగా చిన్న మొత్తాల నోట్లకు (రూ.100, రూ.200) ప్రత్యామ్నాయంగా మారింది. పెద్ద నోట్లకు (రూ.500) కాదు. రూ.500 కంటే తక్కువ విలువైన లావాదేవీలే యూపీఐలో 86% జరుగుతున్నాయి.. అందుకే, మార్కెట్లో రూ.500 నోట్ల ఆధిపత్యం కొనసాగుతోంద’ని నివేదిక వెల్లడించింది.
Follow Us