/rtv/media/media_files/2025/03/11/HJOfk62J0mi7gr26iGAy.jpg)
shambhal BJP leader Photograph: (shambhal BJP leader )
బీజేపీ సీనియర్ లీడర్ సోమవారం అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయన నివాసంలో కూర్చొని ఉండగా.. గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి పాయిజన్ ఇంజెక్ట్ చేసి పారిపోయారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో చోటు చేసుకుంది. 2004లో గన్నౌర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో సవాజ్ వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్‌పై బీజేపీ నుంచి గుల్ఫామ్ సింగ్ యాదవ్ పోటీ చేశారు. గుల్ఫామ్ సింగ్ యాదవ్ బీజేపీ పార్టీలో అనేక కీలక పదవులను కూడా నిర్వహించారు.
🚨 SHOCKING news from Sambhal in the month of Ramadan.
— श्रवण बिश्नोई (किसान) (@SharwanKumarBi7) March 10, 2025
Veteran RSS Swayamsevak and Pradhan Gulfam Singh Yadav poised to death. 💔
Before dying, he revealed that 3 bike-borne youths injected him with poison and run away.🤯
— Some poisonous creatures are still roaming… pic.twitter.com/jHMVYFmfcn
గుల్ఫామ్ సింగ్ యాదవ్(60) సోమవారం మధ్యాహ్నం దఫ్తారా గ్రామం నివాసంలో మంచం మీద కూర్చున్నాడు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆయన కడుపులోకి విషపూరిత పదార్థాన్ని ఇంజెక్ట్ చేశారని ప్రత్యక్ష సాక్షుల చెబుతున్నారు. విషమిచ్చిన వెంటనే దుండగులు బైక్‌పై అక్కడి నుండి పారిపోయారు. గుల్ఫామ్ సింగ్‌ను ఫామిలీ జునావాయిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతన్ని అలీఘర్‌కు తీసుకెళ్లమని సూచించారు. గుల్ఫమ్ సింగ్‌ను చికిత్స కోసం అలీఘర్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మరణించాడు.
ఆయన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కేసు దర్యాప్తు కోసం పోలీసులు టీంను నియమించారు. ఈ కేసు గురించి గన్నౌర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దీపక్ తివారీ వివరాలు వెల్లడించారు.జునావాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని దఫ్తారా గ్రామంలో విషాదం జరిగినట్లు ఆయన చెప్పారు. గుల్ఫామ్‌పై విష ప్రయోగం జరిగిందని ప్రత్యేక్ష సాక్షుల స్టేట్‌మెంట్ తీసుకున్నారు. శంభాల్‌లో ఆయన బీజేసీ సీనియర్, కీలక నేత. గుల్ఫామ్ సింగ్ యాదవ్ వెనుకబడిన తరగతుల కమిషన్ సభ్యుడిగా కూడా పనిచేశారు. బిజెపిలో అనేక కీలక పదవులను నిర్వహించారు. రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు, ప్రాంతీయ ఉపాధ్యక్షుడు, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా కార్యవాహ, బిజెపి ప్రధాన కార్యదర్శిగా కూడా గతంలో పని చేశారు. ఆయన భార్య జావిత్రి దేవి కూడా స్థానిక రాజకీయాల్లో కీలక వ్యక్తి.
Also read: SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో మద్రాస్ IIT రోబోలు