/rtv/media/media_files/2025/02/09/khNICCjADUf2m6bvyYJh.jpg)
meerpet updates
మీర్‌పేట్ మర్డర్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. తన భార్య వెంకటమాధవిని హత్యచేసి, ఆమె డెడ్ బాడీని గురుమూర్తి మాయం చేశాడని పోలీసులతో పాటుగా అందరూ భావించారు. కానీ ఈ ప్రమేయంలో గురుమూర్తి కుటుంబసభ్యుల్లో ముగ్గురు సహకరించినట్లుగా తెలుస్తోంది. వెంకటమాధవిని చంపి ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి, ఆ ముక్కలను వేడినీళ్లలో ఉడికించి ఎముకల్ని కాల్చి, దంచి పొడిచేసి వాటిని చెరువులో కలిపేయడం వరకు గురుమూర్తికి ఆయన కుటుంబ సభ్యుల్లో ముగ్గురు సహకరించినట్లుగా సమాచారం.
పోలీసు వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మీర్‌పేట్ మర్డర్ కేసుకు సంబంధించి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో గురుమూర్తిని ఏ–1గా పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా మరో ముగ్గురి పేర్లనూ కూడా చేర్చారు. ప్రస్తుతం ఆ ముగ్గురూ పరారీలో ఉన్నట్లుగా సమాచారం. గురుమూర్తికి సహకరించిన ఆ ముగ్గురిలో ఇద్దరు మహిళలున్నట్లుగా తెలుస్తోంది.
Also Read : Delhi Elections Results : లక్కీ ఛాన్స్.. ఎన్నికలకు ముందు పార్టీ మారి గెలిచారు!
ప్రత్యేక బృందాలతో అన్వేషణ
అయితే ఈ హత్య కేసులో గురుమూర్తికి కొందరు సహకరించారన్న విషయంపై పోలీసులు ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. కాగా గురుమూర్తిని నాలుగు రోజుల విచారణ నిమిత్తం శనివారం మీర్‌పేట్ పోలీసులు కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. హత్య కేసుకు సంబంధించి మిగతా నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో అన్వేషిస్తున్నారు. గురుమూర్తి విచారణ పూర్తయ్యేలోపు మిగతా నిందితులనూ పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
కాగా గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేశారు. ఆ తర్వాత రిటైరయ్యారు. ప్రస్తుతం కంచన్‌బాగ్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. 13 ఏళ్ల క్రితం ఇతడికి వెంకటమాధవితో పెళ్లి జరిగింది. వీళ్లకు ఇద్దరు సంతానం. వెంకటమాధవి కేసులో దర్యాప్తు కొనసాగుతోందని.. త్వరలో మరిన్ని వివరాలు బయటపెడతామని మీర్‌పేట పోలీసులు వెల్లడించారు.
Also Read : గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లు.. త్వరలో వారి ఖాతాల్లోకి రూ.లక్ష!
Also Read : నువ్వేం శాడిస్ట్ మొగుడివిరా.. భార్య విడాకులు అడిగిందని చలాన్లతో రివేంజ్!