Snake Bitten : చెప్పులో పాము..పాపం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

పాముకాటుతో ఓ  సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందిన ఘటన బెంగళూరులోని బన్నెర్ఘట్టలో చోటుచేసుకుంది. 41 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ను టిసిఎస్ ఉద్యోగి,  రంగనాథ లేఅవుట్ నివాసి అయిన మంజు ప్రకాష్‌గా గుర్తించారు.

New Update
manju

పాముకాటుతో ఓ  సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందిన ఘటన బెంగళూరులోని బన్నెర్ఘట్టలో చోటుచేసుకుంది. 41 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ను టిసిఎస్ ఉద్యోగి,  రంగనాథ లేఅవుట్ నివాసి అయిన మంజు ప్రకాష్‌గా గుర్తించారు. పనికోసమని బయటకు వెళ్లేందుకు మంజు ప్రకాష్‌ చెప్పులు వేసుకున్నాడు. అయితే అందులో ఉన్న పాముపిల్ల అతని బొటనవేలిని కాటేసింది. అతనికి స్పర్శజ్ఞానం లేకపోవడంతో ఈ విషయం మంజు ప్రకాష్‌ కు తెలియదు.  కాటు వేశాక సుమారు 45 నిమిషాలు పాము చెప్పులోనే ఉంది.

కాలి స్పర్శ పూర్తిగా పోవడంతో 

అయితే అప్పటికే అస్వస్థతకు గురైన మంజు నోటినుంచి నురగ వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే మంజు ప్రకాష్‌ చనిపోయాడు. కాగా మంజు ప్రకాష్ కు 2016లో జరిగిన ఓ ప్రమాదంలో కాలి స్పర్శ పూర్తిగా పోయింది. దీంతో తనకు పాము కరిచిన విషయం పాపం అతనికి కూడా తెలియలేదు. ఈ ఘటనపై బన్నేరుఘట్ట ఠాణా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పాము క్రోక్స్ లోపల చిక్కుకుపోయి గాలి లేకపోవడం వల్ల చనిపోయింది.

మూడు రోజుల క్రితం

మరోవైపు బెంగళూరులో మూడు రోజుల క్రితం ఓ మహిళ అదృశ్యమయ్యింది. ఆమె కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు ఎంత గాలించిన ఆచూకి లభించలేదు. చివరికి ఆదివారం ఓ నదిలో ఆమె మృతదేహం దొరికింది. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబీకులు షాకైపోయారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని త్యాగరాజనగర్‌లో ఉంటున్న సీఆర్‌ గోవిందరాజులు కూతురు వసుధ చక్రవర్తి(45).  ఈమె తరచుగా ఉడుపి జిల్లా కొల్లూరులోని మూకాంబిక ఆలయం వద్దకు వెళ్లేది. అక్కడ దేవి దర్శనం చేసుకునేది. అయితే ఎప్పటిలాగే ఆగస్టు 28న ఆమె తన కారులో బెంగళూరు నుంచి కొల్లురుకు వచ్చారు. ఓ లాడ్జిలో ఉన్నారు. మరుసటి రోజు తల్లిదండ్రులు ఆమెకు కాల్ చేస్తే లిఫ్ట్‌ చేయలేదు. ఎన్నిసార్లు చేసినా సమాధానం రాకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పరిశీలించారు. అలాగే స్థానికులను విచారించారు.  ఆమె మరణంపై కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఆమె సూసైడ్‌ చేసుకుందా ? లేదా ఎవరైనా హత్య చేశారా ? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.  

Advertisment
తాజా కథనాలు